
హెచ్‌ఎండీఏ ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేయండి
ఇబ్రహీంపట్నం రూరల్: తొర్రూర్‌లో ప్రభుత్వం ఏర్పాటు చేసిన హెచ్‌ఎండీఏ ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేయాలని లబ్ధిదారులు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు గురువారం అడిషన్ కలెక్టర్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. అబ్దుల్లాపూర్‌మెట్ మండలం తొర్రూరల్‌లో సర్వే నంబర్ 383లో 117 ఎకరాల్లో హెచ్‌ఎండీఏ అభివృద్ధి చేసిన వెంచర్‌లో ప్లాట్లు కేటాయించి నేటికీ రిజిస్ట్రేషన్ చేయలేదని అన్నారు. భూములు కోల్పోయిన తమకు 2022లో ఎకరానికి 300 గజాల చొప్పున కేటాయించినప్పటికీ ఇప్పటికీ రిజిస్ట్రేషన్ చేయలేదన్నారు. పూర్తి హక్కులు కల్పిస్తామని చెప్పిన నాలుగేళ్లు గడిచినా పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికై నా స్పందించి హక్కులు కల్పించాలని కోరారు. కార్యక్రమంలో పలువురు బాధితులు పాల్గొన్నారు.