మహిళలు స్వశక్తితో ఆర్థిక ప్రగతి సాధించాలి
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడికి ఘన స్వాగతం బ్రాహ్మణ సేవాసంఘం నూతన నియామకం
షాద్‌నగర్‌రూరల్: రాష్ట్ర బ్రాహ్మణ సేవాసంఘం సమాఖ్య యువజన ఆర్గనైజింగ్ సెక్రటరీగా పట్టణానికి చెందిన రవికుమార్‌శర్మ (రవిశర్మ) ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ మేరకు గురువారం హైదరాబాద్‌లోని రాష్ట్ర బ్రాహ్మణ సేవాసంఘం సమాఖ్య కార్యాలయంలో సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా బ్రాహ్మణ సంఘం రాష్ట్ర నాయకులు రవిశర్మకు నియామకపత్రం అందజేశారు. పట్టణంలోని శివమారుతీ దేవాలయంలో అర్చకుడిగా పని చేస్తున్న రవిశర్మ గతంలో రాష్ట్ర బ్రాహ్మణ సేవాసంఘం సమాఖ్య డివిజన్ అధ్యక్షుడిగా, జిల్లా కార్యదర్శిగా పని చేశారు.
అడిషనల్ జ్యుడీషియల్ ఫస్ట్‌క్లాస్ మెజిస్ట్రేట్‌గా సాహితి
షాద్‌నగర్‌రూరల్: షాద్‌నగర్ కోర్టు అడిషనల్ జ్యుడీషియల్ ఫస్ట్‌క్లాస్ మెజిస్ట్రేట్, అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జిగా మల్యాల సాహితి నియమితులయ్యారు. హైకోర్టు విడుదల చేసిన ఉత్తర్వుల ప్రకారం బదిలీలు, నూతన ఎంపికలో భాగంగా ఆమె షాద్‌నగర్ కోర్టు నూతన జడ్జిగా నియమతులయ్యారు. గతంలో ఇక్కడ అడిషనల్ జ్యుడిషియల్ ఫస్ట్‌క్లాస్ మెజిస్ట్రేట్‌గా పని చేసిన ధీరజ్‌కుమార్ బదిలీపై వెళ్లారు.
మీర్‌పేట కమిషనర్‌గా
నాగమణి బాధ్యతల స్వీకరణ మహిళలు స్వశక్తితో
ఆర్థిక ప్రగతి సాధించాలి
కడ్తాల్: మహిళలు స్వశక్తితో ఆర్థిక ప్రగతి సాధించాలని తెలంగాణ యువజన సంఘాల ఐక్యవేదిక అధ్యక్షుడు రాఘవేందర్ అన్నారు. మండల కేంద్రంలో అభయ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మహిళలకు నిర్వహిస్తున్న కుట్టు మిషన్ శిక్షణను గురువారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. మహిళలు సొంత కాళ్లపై నిలబడేందుకు అభయ ఫౌడేషన్ అందిస్తున్న సేవలు అభినందనీయమన్నారు. కార్యక్రమంలో వివేకానంద యువజన సంఘం అధ్యక్షుడు మాధవులు, నాయకులు కుమార్‌గౌడ్, మహేశ్, వెంకటేశ్, రమేశ్‌నాయక్, ఇమ్రాన్‌బాబా తదితరులు ఉన్నారు.
మీర్‌పేట మున్సిపల్ కమిషనర్‌గా నాగమణి
మీర్‌పేట: మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్‌గా నాగమణి గురువారం బాధ్యతలు చేపట్టారు. దమ్మాయిగూడ కమిషనర్‌గా పనిచేసిన ఆమె బదిలీపై ఇక్కడికి వచ్చారు. ఈ సందర్భంగా ఏఎంసీ సంరెడ్డి నాగేందర్‌రెడ్డి, డీఈ వేణుగోపాల్, ఇతర సిబ్బంది నాగమణికి పుష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు.