
వ్యవసాయానికి సాగు నీరివ్వాలి
షాద్‌నగర్‌రూరల్: ఉమ్మడి పాలమూరు జిల్లాలోని చంద్రసాగర్, అమ్రాబాద్ ఎత్తిపోతల పథకాన్ని చేపట్టి వ్యవసాయ రంగానికి సాగు నీటిని అందించాలని పాలమూరు అధ్యయన వేదిక జిల్లా అధ్యక్షుడు రవీంద్రనాథ్ డిమాండ్ చేశారు. చంద్రసాగర్, అమ్రాబాద్ ఎత్తిపోతల పథకాన్ని వెంటనే చేపట్టా లని కోరుతూ గురువారం పట్టణంలోని ఎమ్మార్సీ భవనం ఆవరణలో పాలమూరు అధ్యయన వేదిక, ప్రజాసంఘాల ఆధ్వర్యంలో కరపత్రాన్ని ఆవిష్క రించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మహబూబ్‌నగర్ జిల్లాకు అప్పర్‌ప్లాట్‌కు జరిగిన అన్యాయం మరెక్కడా జరగలేదని ఆరోపించారు. ప్రభుత్వాల నిర్లక్ష్యంతోనే పాలమూరు ప్రజలు వలస కూలీలు, నిర్వాసితులుగా మారుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా నుంచి ఎన్నికైన ప్రజాప్రతినిధులు నీటి తరలింపును అడ్డుకునే ప్రయత్నం చేయడంలేదని ఆరోపించారు. అప్పర్‌ప్లాట్ దిగువ రైతాంగానికి, ఎగువ రైతాంగానికి మధ్య విభేదాలు తలెత్తకుండా చంద్రాసాగర్ రిజర్వాయర్ ఆధారంగా నీటిని లిఫ్ట్‌చేసి సాగు నీరందించాలన్నారు. కార్యక్రమంలో ప్రజా సంఘాల నాయకులు అర్జునప్ప, నర్సింలు, కృష్ణ, నర్సింలుగౌడ్, బాలయ్య, తిరుమలయ్య, చంద్రశేఖర్, కృష్ణయ్య, శివరాములు, చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.
పాలమూరు అధ్యయన వేదిక
జిల్లా అధ్యక్షుడు రవీంద్రనాథ్