
బాలాపూర్ గణేశుడి రూట్ మ్యాప్ పరిశీలన
బడంగ్‌పేట్: బాలాపూర్ గణనాథుడి శోభాయాత్రకు తరలివెళ్లే ప్రాంతాలను గురువారం పోలీసులు పరిశీలించారు. రాచకొండ పోలీస్ కమిషనర్ సుధీర్‌బాబు, మహేశ్వరం డీసీపీ సునీతారెడ్డి, మహేశ్వరం ఏసీపీ జానకీరెడ్డి, బాలాపూర్ సీఐ సుధాకర్‌తో కలిసి పర్యటించారు. గణేశుడి కోసం వేస్తున్న సెట్ గురించి ఉత్సవ సమితి అధ్యక్షుడు కళ్లెం నిరంజన్‌రెడ్డిని అడిగి తెలుసుకున్నారు. దర్శనానికి వచ్చే భక్తుల వాహనాల పార్కింగ్ స్థలాన్ని పరిశీలించారు. ఉత్సవాలకు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఉత్సవ కమిటీ నిర్వాహకులకు సూచించారు. అవాంఛనీయ సంఘటనలు జరగకుండా స్థానిక పోలీసులు తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు.