
ఉద్యాన పంటల్లో సస్యరక్షణ
కృషి విజ్ఞాన్ కేంద్రం క్రిడా నిపుణుడు జి.శ్రీకృష్ణ
కందుకూరు: ప్రస్తుతం సాగులో ఉన్న ఉద్యాన పంటలైన టమాటా, బెండ, వంగ, కాకర, జామ వంటి తదితర పంటల్లో ప్రధాన సమస్యలను ఉద్యాన శాస్త్రవేత్తలు గుర్తించారు. ఆయా పంటలకు ఆశిస్తున్న తెగుళ్లు, పురుగులు, వాటి నివారణకు అత్యవసరంగా తీసుకోవాల్సిన అంశాలు, చేపట్టాల్సిన సస్యరక్షణ చర్యలపై కృషి విజ్ఞాన్ కేంద్రం క్రిడా నిపుణుడు శ్రీకృష్ణ రైతులకు పలు సలహాలు, సూచనలు అందించారు.
ముందస్తు రక్షణ చర్యలివే
సూక్ష్మజీవుల మిశ్రమం యొక్క అప్లికేషన్ అనగా ట్రైకోడెర్మా, సూడోమోస్, పెసెలోమైసెస్, అజాటోబాక్టర్, ఫాస్ఫో బాక్టీరియా, ఫోటాస్ బాక్టీరియా, జింక్ బాక్టీరియాలను మొక్కలను నాటడానికి ముందు పశువుల ఎరువులో అభివృద్ధి చేసి పొలంలో వేసుకుంటే తెగుళ్లు, వ్యాధులు, సాగు ఖర్చు తగ్గుతాయి. కూరగాయల పంటలలో ముందు జాగ్రత్త చర్యగా నాటిన 15 రోజుల్లోపు కార్బెండజమ్ 2గ్రా లీటరు నీటితో కలిపి నేల తడిచేలా పిచికారీ చేస్తే మట్టిలో పుట్టే రోగాలు రాకుండా చూడవచ్చు. రసం పీల్చే తెగుళ్లను నివారించడానికి లీటరు నీటికి ఇమిడాక్లోఫ్రిడ్ 0.3 మి.లీ పిచికారీ చేయాలి. అన్ని ఉద్యాన పంటలు సూక్ష్మపోషక లోపం లక్షణాలను కనబరుస్తున్నట్లు గుర్తించడమైనది. మ్యాక్స్ లేదా గ్రోత్ లేదా విపుల్ లేదా స్వర్ణపాల్ లేదా ఫార్ములాస్– 4 లేదా అర్కా వెజిటబుల్ స్పెషల్ 2– 3 గ్రా. లీటరు నీటికి పూల మొగ్గ ప్రారంభించే ముందు, పుష్పించే ముందు, పండు దశల్లో మూడుసార్లు పిచికారీ చేయాలి.
పంట గుర్తించిన సమస్య
తీసుకోవాల్సిన చర్యలు
● టమాటాలో..
ఆకు ముడత లీటర్ నీటిలో ఒక మి.లీ లేదా 1.5 గ్రాముల క్లోరోథలనిల్ లేదా ఒక మి.లీ.లీటరు నీటికి కలిపి పది రోజుల వ్యవధిలో రెండు సార్లు పిచికారీ చేయాలి. ప్రొఫికోనోజోల్ పిచికారీ చేయాలి
● బ్యాక్టీరియల్ ఎండు తెగులు..
కాపర్‌ఆక్సీక్లోరైడ్ 30 గ్రా+స్ట్రెప్టోసైక్లిన్ 10 లీటర్ల నీటికి ఒక గ్రాముతో మట్టిని తడిపి, అదే మోతాదులో రసాయనాలతో ఫోలియర్‌ను పిచికారీ చేయాలి.
● బూజు తెగులు..
లీటరు నీటికి సల్ఫర్ 3 గ్రా లేదా డైఫెంకోనోజోల్ 0.5 మి.లీ లేదా సాఫ్ 2 గ్రాములు కలిపి స్ప్రే చేయాలి.
● తేనెబంగ, తామర పురుగుల..
తేమ ఎక్కువగా ఉన్నప్పుడు థయోమిథాక్సిమ్ 0.3 గ్రా. లేదా డైఫెంతురియన్ 1.25గ్రా నివారణకు లేదా అసిఫెట్ 1.5 గ్రా లేదా డైమిథోయేట్ 2 మి.లీ లేదా ఫిఫ్రోనిల్ 2 మి.లీ లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి.
● పండు తొలుచు పురుగు ..
వరి తవుడు+బెల్లం+ మోనోక్రోటోఫాస్ లేదా క్లోరోపైరీఫాస్‌తో విషపు ఎరలను వరుసల మధ్య వేయాలి. అబామెక్టిన్ బెంజోయేట్ 0.4 గ్రా లేదా ప్రొఫెనోఫాస్ 2 మి.లీ+డైక్లోరోవాస్ 1 మి.లీ లేదా థయోడికార్బ్ 1 గ్రా లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి.
● పాము పొడ తెగులు
ట్రైజోఫాస్ 2 మి.లీ లేదా డైఫెంతురీయన్ 1.25 గ్రాము, వేప నూనె 5 మి.లీ లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి.
● కాయ కుళ్లు తెగులు..
లీటరు నీటికి 5 గ్రా కాల్షియం నైట్రేట్‌ను వారం మధ్యలో రెండు సార్లు పిచికారీ చేయాలి.
● పూత, పిందె రాలకుండా..
ప్లానోఫిక్స్ 3 మి.లీ+ సూక్ష్మపోషక మిశ్రమం 45 గ్రా. 15 లీటర్ల నీటికి కలిపి 15 రోజుల వ్యవధిలో రెండు సార్లు పిచికారీ చేయాలి.
● వంకాయలో సస్యరక్షణ..
కాయ, కొమ్మ రెనాక్సిపైర్ 0.3 మి.లీ లేదా ప్రొఫెనోఫాస్ 2 మి.లీ+డైక్లోరోవాస్ తొలిచే పురుగు ఒక మి.లీ లీటరుకు 5 మి.లీ వేప నూనెతో కలిపి పిచికారీ చేయాలి.
● ఎర్ర నల్లి..
సల్ఫర్ 3గ్రా లేద ఆఅబామెక్టిన్ 1.0 గ్రా. లేదా ఫెంతురియన్ 1.25 గ్రా లేదా డైకోఫాల్ 5 మి.లీ లేదా ప్రొపార్జైట్ 2 మి.లీ లీటరు నీటికి వేప నూనెతో కలిపి పిచికారీ చేయాలి.
● బెండతోటలో..
కాయ తొలుచు పురుగు రెనాక్సిఫైర్ 0.3 మి.లీ లేదా ప్రొఫెనోఫాస్ 2 మి.లీ+డైక్లోరోవాస్ 1 మి.లీ లీటరు నీటికి 5 మి.లీ వేప నూనెతో కలిపి పిచికారీ చేయాలి.
● రసం పీల్చే పురుగు..
తేమ ఎక్కువగా ఉన్నప్పుడు థయోమిథాక్సిమ్ 0.3గ్రా లేదా డైఫెంతురియన్ 1.25గ్రా లేదా ఎసిఫేట్ 1.5 గ్రా, లేదా డైమిథోయేట్ 2 మి.లీ లేదా ఫిఫ్రోనిల్ 2 మి.లీ లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి.
● ఎర్ర పురుగు..
సల్ఫర్ 3గ్రా లేద ఆఅబామెక్టిన్ 1.0 గ్రా. లేదా డైఫెంతురియన్ 1.25 గ్రా లేదా డైకోఫాల్ 5 మి.లీ లేదా ప్రొపార్జైట్ 2 మి.లీ లీటరు నీటికి వేప నూనెతో కలిపి పిచికారీ చేయాలి.
● కాకర,బెండలో..
కాయ తొలుచు పురుగు సామూహిక ట్రాపింగ్ కోసం ఫెరోమోన్ ఉచ్చులు(15–20/ఎకరం)ఉంచాలి. డైక్లోరోవాస్ 1 మి.లీ లీటరు నీటికి పిచికారీ చేయాలి.
● రసం పీల్చే పురుగు..
తేమ ఎక్కువగా ఉన్నప్పుడు థయోమిథాక్సిమ్ 0.3గ్రా లేదా డైఫెంతురియన్ 1.25గ్రా లేదా ఎసిఫేట్ 1.5 గ్రా, లేదా డైమిథోయేట్ 2 మి.లీ లేదా ఫిఫ్రోనిల్ 2 మి.లీ లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి.
● జామ..
ఫ్రూట్ ఫ్లై సామూహిక ట్రాపింగ్ కోసం ఫెరోమోన్ ఉచ్చులు (15–20/ఎకరం) ఉంచాలి.మలాథియాన్ 2 మి.లీ లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి.

ఉద్యాన పంటల్లో సస్యరక్షణ

ఉద్యాన పంటల్లో సస్యరక్షణ

ఉద్యాన పంటల్లో సస్యరక్షణ

ఉద్యాన పంటల్లో సస్యరక్షణ

ఉద్యాన పంటల్లో సస్యరక్షణ

ఉద్యాన పంటల్లో సస్యరక్షణ

ఉద్యాన పంటల్లో సస్యరక్షణ