
డ్రోన్ టెక్నాలజీని వినియోగించుకోవాలి
అబ్దుల్లాపూర్‌మెట్: కూలీల కొరతను అధిగమించేందుకు రైతులు డ్రోన్ టెక్నాలజీని వినియోగించుకునేందుకు ముందుకు రావాలని జిల్లా వ్యవసాయాధి కారి ఉష సూచించారు. మండల కేంద్రంలోని రైతు వేదికలో మంగళవారం నిర్వహించిన రైతు నేస్తం కార్యక్రమానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యా రు. ఈ సందర్భంగా శ్రీపాత మామిడి తోటల పున రుజ్జీవనం–వాతావరణ బులిటెన్– డిజిటల్ వ్యవసాయంలో డ్రోన్ టెక్నాలజీ వినియోగంశ్రీ అంశా లపై రైతులకు అవగాహన కల్పించారు. తెగుళ్ల నివా రణకు పురుగు మందు పిచికారీకి డ్రోన్ స్ప్రేలను వినియోగించుకోవాలని శాస్త్రవేత్తలు సూచించినట్లు తెలిపారు. తక్కువ సమయంలో ఎక్కువ ఎకరాలకు పిచికారీ చేయొచ్చని అన్నారు. కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి ఐ.పల్లవి, వ్యవసాయ విస్తరణాధికారి ఎన్.రఘు పాల్గొన్నారు.