
ప్రభుత్వ హాస్టళ్లలో టాస్క్‌ఫోర్స్ తనిఖీలు
ఇబ్రహీంపట్నం: స్థానిక ప్రభుత్వ సాంఘిక సంక్షేమ గురుకుల బాలుర పాఠశాల, కళాశాలలో సివిల్ సప్లయ్ టాస్క్‌ఫోర్స్ అధికారులు మంగళవారం ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించారు. బియ్యం నిల్వలు స్టాక్, సప్లయ్‌కి సంబంధించిన వివారాలను అడిగి తెలుసుకున్నారు. వంట గది, పరిసరాల పరిశుభ్రతను పరిశీలించారు. విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. అనంతరం సివిల్ సప్లయ్ టాస్క్‌ఫోర్స్ డీఎస్సీ రమేష్‌రెడ్డి మాట్లాడుతూ.. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్ అండ్ కాలేజీల్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తున్నామని చెప్పారు. ఈ కార్యక్రమంలో టాస్క్‌ఫోర్స్ సీఐ అజయ్‌బాబు, ఎస్‌ఐ కృష్ణ, డిప్యూటీ తహీసీల్దార్ రామకృష్ణ, గురుకుల ప్రిన్సిపల్ శ్రీరామ్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.