
గణేశ్ ఉత్సవాల వేళ జాగ్రత్త
షాద్‌నగర్‌రూరల్: గణేశ్ నవరాత్రి ఉత్సవాలను ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని ఏసీపీ లక్ష్మీనారాయణ సూచించారు. నవరాత్రులను పురస్కరించుకొని సోమవారం పట్టణంలోని బుగ్గారెడ్డి గార్డెన్‌లో పట్టణ సీఐ విజయ్‌కుమార్ ఆధ్వర్యంలో శాంతిసంఘం సమావేశం నిర్వహించారు. సమావేశానికి ముఖ్యఅతిథిగా హాజరైన ఏసీపీ మాట్లాడుతూ.. మండపాల ఏర్పాటుకు అనుమతులు తీసుకోవాలని, మండపాల వద్ద ఎలాంటి ఘటనలు చోటుచేసుకోకుండా తప్పనిసరి సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని అన్నారు. ఎవరైనా అను మానాస్పదంగా కనిపించినా, శాంతిభద్రతలకు విఘాతం కలిగించినా వెంటనే పోలీసులకు, డయ ల్ 100కు సమాచారం అందించాలని కోరారు. రా త్రి సమయాల్లో మండపాలవద్ద పోలీసు పహారా ఉంటుందని, పాయింట్ బుక్‌లు ఏర్పాటు చేసి పెట్రోలింగ్ నిర్వహిస్తామన్నారు. సమావేశంలో గణేశ్ ఉత్సవ కమిటీ అధ్యక్షుడు బండారి రమేష్, గౌరవ అధ్యక్షుడు అందెబాబయ్య, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ మహ్మద్‌అలీఖాన్ బాబర్, మున్సిపల్ చైర్‌పర్సన్ సునీత, విద్యుత్ ఏడీ సత్యనారాయణ, డీఐ వెంకటేశ్వర్లు, ఎస్‌ఐలు సుశీల, రాంచందర్, శరత్‌కుమార్, ప్రణయ్, శ్రీకాంత్, ఎంవీఐ వాసు, ఫైర్ అధికారి నాగరాజు తదితరులు పాల్గొన్నారు.