
నూతనంగా బడి భవనం నిర్మించండి
యాచారం: శిథిలావస్థ పాఠశాలకు నూతన భవనం నిర్మించాలని మండల పరిధిలోని మంతన్‌గౌరెల్లి గ్రామస్తులు కోరారు. సోమవారం విద్యాశాఖ అసిస్టెంట్ డైరెక్టర్ పూర్ణచందర్‌రావును నగరంలోని ఆయన కార్యాలయంలో కలిసి వినతిపత్రం అందజేశారు. పురాతన భవనం కావడంతో పై కప్పు పగుళ్లు ఏర్పడిందని, తరగతి గదులు కురుస్తున్నాయని తెలిపారు. భవన నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలని కోరారు. దీనికి ఆయన సానుకూలంగా స్పందించారని గ్రామస్తులు తెలిపారు. కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ తావునాయక్, డీవైఎఫ్‌ఐ జిల్లా నాయకుడు చందునాయక్, ఎస్‌ఎఫ్‌ఐ మండల ఉపాధ్యక్షుడు భాస్కర్‌నాయక్, నాయకులు కుమార్, జంగయ్య, రవి, గణేశ్ పాల్గొన్నారు.