
ఘనంగా కుంకుమార్చన
ఆధ్యాత్మిక చింతనతో మానసిక ప్రశాంతత లభిస్తుందని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు చనువెల్లి ప్రభాకర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే కె.ఎస్.రత్నం అన్నారు. సంగమేశ్వర దేవాలయంలో సోమవారం ఘనంగా కుంకుమార్చన నిర్వహించారు. మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని శివలింగానికి అర్చన చేశారు. అనంతరం నాయకులు మాట్లాడుతూ.. ప్రతిఒక్కరూ భక్తిభావాలను పెంపొందించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మండల అధ్యక్షుడు శ్రీకాంత్, లక్ష్మీపతియాదవ్, పద్మనాభం, వెంకటేశ్ తదితరులు పాల్గొన్నారు. – మొయినాబాద్ రూరల్