
రాజకీయ లబ్ధికోసమే భూ ధారాదత్తం
బడంగ్‌పేట్: పేదలు సాగుచేసుకుంటున్న భూములను గత ప్రభుత్వం లాక్కొని.. రాజకీయ లబ్ధికోసం, ఓట్ల కోసం క్రైస్తవులకు ధారాదత్తం చేసిందని సోషలిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా యునైటెడ్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బొద్రమోని పురుషోత్తం ఆరోపించారు. సోమవారం కార్పొరేషన్ పరిధి కుర్మల్‌గూడలో జి.కృష్ణ ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. పేదల భూములను నాటి బీఆర్‌ఎస్ సర్కార్‌బలవంతంగా గుంజుకుందని విమర్శించారు. కుర్మల్‌గూడలో ఇళ్లులేని ఎంతో మంది పేదలు ఉన్నారని, వారికి 60 గజాలు కేటాయించడానికి మనస్సు రాని బీఆర్‌ఎస్.. క్రైస్తవుల మెప్పు పొందడానికి వారి సమాధులకు ఎకరాల కొద్దీ స్థలాన్ని ఎలా కేటాయించిందని ప్రశ్నించారు. ఆ భూములను కాంగ్రెస్ ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని డిమాండ్ చేశారు. ఇళ్లు లేని పేదలకు పంపిణీ చేయాలని కోరారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు సుజాత, నాగేంద్రమ్మ, భానుప్రసాద్, ఆర్.ఝాన్సీ, రాజు, ఎం.అరుణ, జి.జగదాంబ, పి.జ్యోతి, సురేష్ తదితరులు పాల్గొన్నారు.
సోషలిస్ట్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పురుషోత్తం