
ఆధ్యాత్మికతతో మానసిక ప్రశాంతత
షాబాద్: ఆధ్యాత్మిక చింతనతో మానసిక ప్రశాంతత కలుగుతుందని దేవాదాయ ధర్మాదాయశాఖ ఈఓ శ్రీనివాస్ అన్నారు. సోమవారం మండల పరిధి కొమరబండ గ్రామంలో శ్రీ బుగ్గరామేశ్వరస్వామి దేవాలయంలో శ్రావణమాస చివరి సోమవారం సందర్భంగా శివపార్వతులకు కల్యాణం, అభిషేకం, ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేదపండితుల మంత్రోచ్ఛారణల మధ్య దేవతామూర్తుల కల్యాణం అంగరంగ వైభవంగా జరిపించారు. కార్యక్రమలో ఆలయ చైర్మన్ వెంకటయ్య, వైస్ చైర్మన్ మాధవరెడ్డి, సభ్యులు సత్యనారాయణ, రాణిమ్మ, సునీత, మాజీ సర్పంచ్‌లు చంద్రశేఖర్, దేవేందర్‌రెడ్డి, నాయకులు రంగదాసు, నర్సింహ్మారెడ్డి, గోపాల్‌రెడ్డి, అంజయ్య, సత్తయ్యగౌడ్, కుమార్, నరేష్, వెంకటేశ్, నర్సింహులు, బాలరాజ్, రాజు, రమేష్ తదితరులు పాల్గొన్నారు.
దేవాదాయ ధర్మాదాయశాఖ ఈఓ శ్రీనివాస్