
బీఈడీ అభ్యర్థులకు న్యాయం చేయండి
పరిగి: స్పెషల్ బీఈడీ అభ్యర్థులకు న్యాయం చేయాలని వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షుడు రాజేష్ డిమాండ్ చేశారు. మండల పరిధిలోని బసిరెడ్డిపల్లి గ్రామంలో ఆదివారం నిర్వహించిన వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి మఖ్య కార్యకర్తల సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లా డుతూ.. వందశాతం రిక్రూట్‌మెంట్ చేయాల్సిన పోస్టులను.. 2024 డీఎస్సీలో 30శాతం చేసి, మిగతా 70శాతం పదోన్నతులు కల్పించడం సరికా దని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం 2016లో తెచ్చి న వికలాంగుల హక్కుల చట్టాన్ని రాష్ట్ర ప్రభుత్వం విస్మరించిందని ఆరోపించారు. సీఎం రేవంత్‌రెడ్డి వెంటనే స్పందించి, వందశాతం రిక్రూట్‌మెంట్ ద్వారానే ఖాళీలను భర్తీ చేయాలని కోరారు.