ఊరికి వెళ్తున్నానని చెప్పి.. కనిపించకుండా పోయి | - | Sakshi
Sakshi News home page

ఊరికి వెళ్తున్నానని చెప్పి.. కనిపించకుండా పోయి

Aug 18 2025 8:00 AM | Updated on Aug 18 2025 8:15 AM

ఊరికి వెళ్తున్నానని చెప్పి.. కనిపించకుండా పోయి

ఊరికి వెళ్తున్నానని చెప్పి.. కనిపించకుండా పోయి

పహాడీషరీఫ్‌: యువ కుడు అదృశ్యమైన సంఘటన పహాడీషరీఫ్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పశ్చిమ బెంగాల్‌ రాష్ట్రానికి చెందిన సాబెర్‌ హుస్సేన్‌ (20) రెండు నెలల క్రితం తుక్కుగూడకు వలస వచ్చి హర్షగూడలో ఉన్న కంపెనీలో లేబర్‌గా పని చేస్తున్నాడు. తనకు ఇక్కడ పని చేయడం ఇష్టలేదని తోటి స్నేహితుడు లస్కర్‌కు చెప్పి సొంతూరు వెళ్తానంటూ ఈ నెల 6న బయల్దేరాడు. సొంతూరుకు వెళ్లకపోవడంతో పాటు ఫోన్‌ స్విచ్ఛాఫ్‌ వచ్చింది. ఈ విషయమై స్నేహితుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఆచూకీ తెలిసిన వారు పోలీస్‌స్టేషన్‌లో గానీ 87126 62367 నంబర్‌లో గానీ సమాచారం ఇవ్వాలని సూచించారు.

ఎకై ్సజ్‌ పోలీసులు

దాడిచేశారంటూ ఫిర్యాదు

తమపై కూడా దాడి జరిగిందని

ఎకై ్సజ్‌ పోలీసులు సైతం..

జీడిమెట్ల: నాంపల్లి ఎకై ్సజ్‌ అండ్‌ ప్రొహిబిషన్‌ ఇన్‌స్పెక్టర్‌ కోటమ్మ తన సోదరుడిపై సర్జికల్‌ బ్లేడ్‌తో దాడిచేయించారని కుత్బుల్లాపూర్‌కు చెందిన పవన్‌ కుమార్‌ జీడిమెట్ల పోలీసులకు ఫిర్యాదు చేశారు. అదే విధంగా నాంపల్లి ఎకై ్స జ్‌ అండ్‌ ప్రొహిబిషన్‌ ఇన్‌స్పెక్టర్‌ కోటమ్మ సైతం తన విధులకు కొందరు అటంకం కలిగించారని ఫిర్యాదు చేశారు. జీడిమెట్ల ఇన్స్‌పెక్టర్‌ గడ్డం మల్లేష్‌ ఇరువురి ఫిర్యాదులు తీసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

● శనివారం రాత్రి ఓ యువకుడి గంజాయి,హష్‌ అయిల్‌ సేవిస్తుండగా ఎకై ్సజ్‌ అధికారులు పట్టుకున్నారు. రెండవ వ్యక్తిని పట్టుకునేందుకు కుత్బుల్లాపూర్‌లోని అయోధ్యనగర్‌కు ఎకై ్సజ్‌ ఇన్స్‌పెక్టర్‌ కోటమ్మ తన సిబ్బందితో వెళ్లారు. అక్కడ దర్యాప్తు చేస్తుండగా స్థానికంగా ఉన్న హేమంత్‌, నితీష్‌, రవితేజ, చరణ్‌ పోలీసుల విధులకు ఆటంకం కలిగించారంటూ ఆమె జీడిమెట్ల ఠాణాలో ఫిర్యాదు చేశారు.

● శనివారం రాత్రి ఎకై ్సజ్‌ అధికారులు బాలు మహేందర్‌,హేమంత్‌ అనే ఇద్దరిని విచారణ చేస్తున్నారు. వెంకటేశ్వర నగర్‌కు చెందిన చంటియాదవ్‌ చూసి వారిని పట్టుకోవడానికి మీరెవరు అంటూ ప్రశ్నించాడు. దీంతో వారు దాడిచేశారని.. డాక్టర్లు 23కుట్లు వేశారని బాధితుడి సోదరుడు పవన్‌కుమార్‌ జీడిమెట్ల పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు ఇరు వర్గాల ఫిర్యాదులు తీసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement