
విస్తారంగా వర్షాలు
నీటమునిగిన పంటలు
పూడూరు: ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు పంటలు నీటమునిగాయి. రోడ్లన్నీ జలమయమయ్యాయి. మండల పరిధి రేగడిమామిడిపల్లి, బార్లపల్లి, చన్గోముల్, తిమ్మాపూర్, కంకల్, మిట్టకంకల్, చింతలపల్లి, పూడూరు, పుడుగుర్తి తదితర గ్రామాల్లోని లోతట్టు ప్రాంతాల్లో పంటలు దెబ్బతిన్నాయి. చన్గోముల్– బార్లపల్లి మధ్య వాగు ఉధృతంగా ప్రవహించడంతో రోడ్డుపై బురద వచ్చి చేరింది. పుడుగుర్తి, కడుమూరు, కంకల్, మంచన్‌పల్లి, మేడిపల్లికలాన్, ఈసి వాగు పరుగులు తీస్తోంది. దెబ్బతిన్న పంటలకు నష్ట పరిహారం అందించాలని రైతులు కోరుతున్నారు.
ఇసుక ట్రాక్టర్ల పట్టివేత
బొంరాస్‌పేట: అక్రమంగా ఇసుక తరలిస్తున్న రెండు ట్రాక్టర్లను ఆదివారం పోలీసులు పట్టుకున్నారు. ఈ మేరకు ట్రాక్టర్ల యజమానులు అంజిలయ్య, శ్రీకాంత్‌లపై కేసునమోదు చేశా మని ఎస్‌ఐ బాల వెంకటరమణ తెలిపారు.