
చికిత్స పొందుతూ జీపీ కార్మికుడి మృతి
కేశంపేట: చికిత్స పొందుతూ జీపీ కార్మికుడు మృతి చెందిన సంఘటన మండల పరిధిలోని భైర్కాన్‌పల్లిలో చోటుచేసుకుంది. పోలీసులు, గ్రామస్తుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన గాదెకాడి శ్రీనయ్య (42) పంచాయతీలో మల్టీపర్పస్ వర్కర్‌గా విధులు నిర్వర్తిస్తున్నాడు. భార్య, ముగ్గురు ఆడపిల్లలతో కలిసి జీవనం సాగిస్తున్నాడు. మద్యానికి బానిసైన శ్రీనయ్య తాగేందుకు డబ్బులు కావాలని తరచూ భార్య తో గొడవ పడేవాడు. ఈ క్రమంలో ఈ నెల 7న రాత్రి తాగి ఇంటికి వచ్చాడు. ఇంకా మద్య ం తాగేందుకు డబ్బులు కావాలని భార్యను అడగడంతో ఆమె లేవని తెలిపింది. దీంతో అదే రాత్రి ఇంట్లో ఉన్న కలుపుమందు తాగా డు. గమనించిన కుటుంబ సభ్యులు షాద్‌నగర్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అక్కడి వైద్యుల సూచన మేరకు నగరంలోని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ శనివారం మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
టిప్పర్, స్కూటీ ఢీ..వ్యక్తికి తీవ్ర గాయాలు
దుద్యాల్: టిప్పర్ – స్కూటీ ఢీకొన్న ఘటనలో ఓ వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన మండలంలోని రోటిబండ తండా సమీపంలో లగచర్ల గేటు వద్ద శుక్రవారం రాత్రి చోటు చేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి. నారాయణపేట జిల్లా గుండుమల్ మండలం గండిహనుమాన్(దామ్లా) తండాకు చెందిన హన్మంతు హైదరాబాద్ నుంచి సొంత గ్రామానికి స్కూటీపై వస్తున్న క్రమంలో లగచర్ల గేటు వద్ద హకీంపేట్ నుంచి ఎదురుగా వస్తున్న టిప్పర్ ఢీ కొట్టింది. దీంతో హన్మంతు తలకు తీవ్ర గాయమైంది. మహబూబ్‌నగర్‌లోని ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.