
చెల్లెలిని చూసేందుకు వెళ్తూ..
కడ్తాల్: రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి చెందిన సంఘటన కడ్తాల్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. సీఐ గంగాధర్ తెలిపిన వివరాలివీ.. నాగర్‌కర్నూల్ జిల్లా కోడేరు గ్రామానికి చెందిన కొమ్మరి శివకృష్ణ (24) కొంత కాలంగా హైదరాబాద్‌లో టిప్పర్ డ్రైవర్‌గా పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు. గ్రామంలో ఉండే చెల్లెలు స్వప్న క్రిమిసంహారక మందు తాగి ఆస్పత్రిలో చికిత్స పొందుతుందనే సమాచారం మేరకు శుక్రవారం తెల్లవారుజామున నగరం నుంచి ద్విచక్ర వాహనంపై బయలుదేరాడు. మార్గమధ్యలో మండల కేంద్రం సమీపానికి చేరుకోగానే గుర్తు తెలియని వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో శివకృష్ణకు తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని శివకృష్ణను చికిత్స నిమిత్తం కల్వకుర్తి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. చికత్స పొందుతూ అతను మృతి చెందాడు. శనివారం మృతుడి తల్లి సైదమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.