
స్థానిక పోరులో సత్తా చాటుతాం
మహేశ్వరం: రంగారెడ్డి జిల్లా కబడ్డీ అసోసియేషన్ చైర్మన్, తుమ్మలూరు మాజీ సర్పంచ్ మద్ది కరుణాకర్‌రెడ్డి జన్మదిన వేడుకలు బుధవారం ఆయన అభిమానులు ఘనంగా నిర్వహించారు. మండలంలోని ఆయన గృహానికి చేరుకొని కేక్‌ను కట్ చేయించారు. కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్‌చార్జి కేఎల్‌ఆర్, మాజీ జెడ్పీ చైర్‌పర్సన్ తీగల అనితారెడ్డి, మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డిలతో పాటు పలువురు నేతలు ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తుమ్మలూరు గ్రామాభివృద్ధికి తన వంతు కృషి చేస్తామన్నారు. త్వరలో జరిగే స్థానిక ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పని చేసి కాంగ్రెస్ జెండాను ఎగురవేస్తానని ధీమా వ్యక్తం చేశారు. కార్యక్రమంలో మాజీ సర్పంచ్ మద్ది సురేఖారెడ్డి, నాయకులు రాఘవేందర్‌రెడ్డి, జైపాల్‌రెడ్డి, యాదగిరిగౌడ్, చంద్రశేఖర్‌రెడ్డి, శ్రీధర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.