మన ఎయిర్‌పోర్టుకు మరో ఘనత
‘ఆర్‌జీఐఏ’కు లెవెల్ 5 కార్బన్ అక్రిడిటేషన్ గుర్తింపు
శంషాబాద్: జీఎంఆర్ హైదరాబాద్ ఎయిర్‌పోర్టు లిమిటెడ్ సంస్థ నిర్వహణలోని రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి మరో ప్రఖ్యాత గుర్తింపు దక్కింది. జీఎంఆర్ ఎయిర్‌పోర్టు వర్గాలు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.. ఆసియా పసిఫిక్, మధ్య తూర్పు దేశాల్లో నాలుగు విమానాశ్రయాల్లో కార్బన్ అక్రిడిటేషన్ గుర్తింపు పొందిన నాలుగు విమానాశ్రయాల్లో ఆర్‌జీఐఏ ఒకటి అన్నారు. కర్బన ఉద్గారాల తగ్గింపును జీరో స్థాయికి తీసుకురావడంతో ఆర్‌జీఐఏ చేస్తున్న కృషికి ఈ గుర్తింపు లభించిందని జీఎంఆర్ ఎయిర్‌పోర్టుల ఈడీ, చీఫ్ ఇన్నోవేషన్ అధికారి ఎస్‌జీకే కిశోర్ తెలిపారు. పర్యావరణహిత చర్యలు, సోలార్ ఎనర్జీ, ఎల్‌ఈడీల నిర్వహణ తదితర అంశాల్లో వివిధ భాగస్వాముల సహకారంతో ఈ గుర్తింపు సాధ్యమైందన్నారు.


