13 మంది అరెస్ట్
పహాడీషరీఫ్: గుట్టు చప్పుడు కాకుండా పహాడీషరీఫ్ పోలీస్ స్టేషన్ పరిధిలో కోడి పందేలు నిర్వహిస్తున్న స్థావరంపై మహేశ్వరం జోన్ ఎస్‌వోటీ పోలీసులు దాడులు చేసి 13 మందిని అరెస్ట్ చేశారు. వివరాలిలా ఉన్నాయి. జల్‌పల్లి గ్రామంలోని బాలాజీ వెంచర్‌లో కొన్ని రోజులుగా ఓ ముఠా కోడి పందేలు నిర్వహిస్తుంది. సోమవారం రాత్రి సైతం పందేలు నిర్వహిస్తున్నారన్న విశ్వసనీయ సమాచారంతో మహేశ్వరం జోన్ ఎస్‌వోటీ, పహాడీషరీఫ్ పోలీసులు సంయుక్తంగా దాడులు చేశారు. వెంకటేశ్వర్లు, బ్రహ్మయ్య, వీరబాబు, నాగరాజు, హరీష్, వెంకటేశ్వర్, ఉదయ్ భాస్కర్‌రాజ్, రవీందర్, వీర్రాజు, గోపి, వెంకట్‌రావు, బిసల్ సింగ్, అంకయ్యలను అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి రూ.13,610 నగదు, 16 కోడి పందేల కత్తులు, రెండు కోళ్లు, 10 మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు.