విజయ డెయిరీ ప్రారంభం | - | Sakshi
Sakshi News home page

విజయ డెయిరీ ప్రారంభం

Mar 17 2026 8:43 AM | Updated on Mar 17 2026 8:43 AM

షాద్‌నగర్‌రూరల్‌: పట్టణంలోని నాగులపల్లి రోడ్డు(10వ వార్డు)లో నూతనంగా ఏర్పాటు చేసిన విజయ డెయిరీ సెంటర్‌ను సోమవారం ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్‌ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో పాడి పరిశ్రమను అభివృద్ధి చేయడంలో భాగంగా డెయిరీని ఏర్పాటు చేస్తున్నామన్నారు. ప్రజలందరూ స్వచ్ఛమైన విజయ డెయిరీ పాలు, పాల పదార్థాలను వాడుకోవాలని సూచించారు. రాబోయే రోజుల్లో జిల్లాలో ప్రభుత్వం ద్వారా మరిన్ని సెంటర్‌లను ఏర్పాటు చేస్తామన్నారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే బక్కని నర్సింలు, మున్సిపల్‌ చైర్మన్‌ అగ్గనూరి బసవేశ్వర్‌, కౌన్సిలర్లు శ్రావణి, మురళీమోహన్‌, కమిషనర్‌ సునీత, మోహన్‌, మురళీ, ధన్‌రాజ్‌ పాల్గొన్నారు.

బీఆర్‌ఎస్‌ నాయకుడికి నివాళి

చేవెళ్ల: సర్ధాన్‌నగర్‌ గ్రామానికి చెందిన బీఆర్‌ఎస్‌ నాయకుడి హఠాన్మరణం బాధాకరమని జెడ్పీటీసీ మాజీ సభ్యుడు పట్నం అవినాశ్‌రెడ్డి అన్నారు. షాబాద్‌ మండలంలోని సర్ధార్‌నరగ్‌ గ్రామానికి చెందిన బీఆర్‌ఎస్‌ పార్టీ నాయకుడు పలాది శ్రీనివాస్‌ ఆదివారం గుండెపోటుతో మృతి చెందాడు. ఈ విషయం తెలిసుకున్న పట్నం అవినాశ్‌రెడ్డి, మండల నాయకులతో కలిసి సోమవారం గ్రామానికి వచ్చి మృతదేహం వద్ద నివాళులర్పించి కుటుంబసభ్యులను ఓదార్చారు. మృతుని కుటుంబాన్ని అన్ని విధాలుగా ఆదుకుంటామని తెలిపారు. ఆయన వెంట బీఆర్‌ఎస్‌ నాయకులు సర్పంచ్‌ మామిడి కీర్తిహరీశ్‌, శ్రీరామ్‌రెడ్డి, మధుసూదన్‌రెడ్డి, రామ్మోహన్‌గుప్తా తదితరులు ఉన్నారు. అదేవిధంగా మండలంలోని లింగారెడ్డిగూడలో గ్రామ సర్పంచ్‌ పొన్న సుధాకర్‌రెడ్డి తండ్రి కృష్ణారెడ్డి దశదిన కర్మలో ఆయన పాల్గొని నివాళులర్పించారు.

గ్యాస్‌ ధరల పెంపుతో పేదలపై భారం

రైతు సంఘం రాష్ట్ర కౌన్సిల్‌ సభ్యుడు సుధాకర్‌గౌడ్‌

మొయినాబాద్‌: కేంద్ర ప్రభుత్వం పెంచిన గ్యాస్‌ ధరలను వెంటనే తగ్గించి.. గ్యాస్‌ సిలిండర్లనూ పూర్తిస్థాయిలో అందుబాటులోకి తేవాలని తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర కౌన్సిల్‌ సభ్యుడు సుధాకర్‌గౌడ్‌ డిమాండ్‌ చేశారు. పెంచిన గ్యాస్‌ ధరలను వ్యతిరేకిస్తూ సోమవారం సీపీఐ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అమెరికా–ఇరాన్‌ యుద్ధం కారణంగా దేశంలో గ్యాస్‌ ధరలు పెంచడం దారుణమన్నారు. గ్యాస్‌ ధరల పెంపుతో పేదలపై తీవ్ర భారం పడుతుందన్నారు. గ్యాస్‌ బుకింగ్‌ విధానంలో తెచ్చిన మార్పులను సవరించాలని డిమాండ్‌ చేశారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేయాలన్నారు. కార్యక్రమంలో సీపీఐ మండల కార్యదర్శి కె.శ్రీనివాస్‌, నాయకులు యాదగిరి, ఖాసింబాయ్‌, మోహన్‌రెడ్డి, సురేశ్‌, బాలమణి, పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement