మైసిగండి హుండీ ఆదాయం రూ.15.17 లక్షలు
కడ్తాల్: మైసిగండి మైసమ్మ దేవత, శివాలయ, రామాలయ దేవస్థానం హుండీ ఆదాయాన్ని దేవాదాయశాఖ సహాయ కమిషనర్ శేఖర్ సమక్షంలో అధికారులు మంగళవారం లెక్కించారు. మొత్తం 75 రోజులకు గాను భక్తులు కానుకల రూపేణ వివిధ హుండీల్లో వేసిన మొత్తం లెక్కించగా రూ.15,17,494 ఆదాయం సమకూరింది. ఈ మొత్తాన్ని కడ్తాల్ కెనరా బ్యాంకులో డిపాజిట్ చేయనున్నట్లు అధికారులు తెలిపారు. కార్యక్రమంలో ఈఓ స్నేహలత, ట్రస్టీ శిరోలీ, ఆలయ నిర్వాహకులు తదితరులు పాల్గొన్నారు.
లెక్చరర్ పోస్టులకు
దరఖాస్తుల ఆహ్వానం
మొయినాబాద్‌రూరల్: తెలంగాణ సాంఘిక సంక్షేమ వికారాబాద్ గురుకుల మహిళా డిగ్రీ కళాశాలలో కంప్యూటర్ సైన్స్, కామర్స్, జువాలజీ బోధించేందుకు పార్ట్ టైమ్ ప్రాతిపదికన మహిళా అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ కె.శ్రీనివాస్‌శర్మ తెలిపారు. అభ్యర్థులు సంబంధిత పోస్టు గ్రాడ్యుయేషన్‌లో 55 శాతం మార్కులు పొంది ఉండాలన్నారు. పీహెచ్‌డీ, నెట్, సెట్ ఉన్న వారికి ప్రాధాన్యత ఉంటుందన్నారు. అభ్యర్థులు తమ దరఖాస్తులకు జిరాక్స్ కాపీలను జతచేసి ఈ నెల 14వ తేదీ సాయంత్రం 4 గంటలలోపు మొయినాబాద్ మండల పరిధిలోని తోల్‌కట్ట సమీపంలో గల ఎస్‌వీ విద్యా సంస్థల క్యాంపస్‌లో ఉన్న తెలంగాణ సాంఘిక సంక్షేమ వికారాబాద్ గురుకలు మహిళా డిగ్రీ కళాశాలలో సమర్పించాలని సూచించారు. స్క్రీనింగ్ టెస్ట్, డెమో ద్వారా ఉద్యోగ నియామకం ఉంటుందని వెల్లడించారు. మిగతా వివరాల కోసం 83749 15652 నంబర్‌లో సంప్రదించాలని సూచించారు.
మదర్ డెయిరీలో కార్మికుల ఉద్యోగాలు క్రమబద్ధీకరణ
హయత్‌నగర్: నల్లగొండ, రంగారెడ్డి పాల ఉత్పత్తిదారుల సమాఖ్య(నార్ముల్ మదర్ డెయిరీ)లో తాత్కాలిక పద్ధతిలో పని చేస్తున్న కార్మికుల ఉద్యోగాలను క్రమబద్ధీకరిస్తున్నామని, అర్హులైన వారికి పదోన్నతులు కల్పిస్తున్నామని పాలక మండలి చైర్మన్ లింగాల శ్రీకర్‌రెడ్డి ప్రకటించారు. ఈ మేరకు మంగళవారం కార్మికులకు సంబంధిత పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పలు శీతల కేంద్రాల్లో ఎంతోకాలంగా పని చేస్తున్న కార్మికులు తమ ఉద్యోగాలను క్ర మబద్ధీకరించాలని కోరుతున్నారని చెప్పారు. ఈ మేరకు ఇటీవల జరిగిన పాలక మండలి స మావేశంలో ఏకగ్రీవంగా తీర్మానాన్ని ఆమోదించినట్టు తెలిపారు.సంస్థ ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉన్నా కార్మికుల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకున్న ట్లు ఆయన వివరించారు.కార్యక్రమంలో పలువురు బోర్డు సభ్యులు,అధికారులు పాల్గొన్నారు.
మైసిగండి హుండీ ఆదాయం రూ.15.17 లక్షలు
మైసిగండి హుండీ ఆదాయం రూ.15.17 లక్షలు


