
ఇబ్రహీంపట్నం కాంగ్రెస్ రెబల్ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేస్తున్న దండెం రాంరెడ్డి
అబ్దుల్లాపూర్‌మెట్: కాంగ్రెస్ పార్టీని 20 ఏళ్లుగా నమ్ముకున్న తనను అధిష్టానం మోసం చేసిందని, ఇబ్రహీంపట్నం నుంచి రెబల్ అభ్యర్థిగా పోటీ చేసి తన సత్తా చూపిస్తానని పీసీసీ ప్రచార కమిటీ సభ్యుడు దండెం రాంరెడ్డి అన్నారు. పార్టీ టికెట్ కోసం చివరి వరకూ పోరాడిన ఆయన అనుచరులు, అభిమానుల అభీష్టం మేరకు రెబల్ అభ్యర్థిగా బరిలో నిలిచారు. శుక్రవారం ఆర్డీఓ కార్యాలయంలో నామినేషన్ దాఖలు చేశారు. అంతకు ముందు పెద్దఅంబర్‌పేటలోని ఆయన నివాసం నుంచి వేలాది మంది అనుచరగణంతో భారీ ర్యాలీగా తరలివెళ్లి గ్రామంలోని బోనమ్మ దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో కౌన్సిలర్ దండెం కృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.