
సమావేశంలో మాట్లాడుతున్న మంత్రి
షాబాద్: ప్రతిపక్షాలకు తెలంగాణలో ఉనికే లేదని రాష్ట్ర గనులు, భూగర్భ వనరుల శాఖ మంత్రి పట్నం మహేందర్‌రెడ్డి పేర్కొన్నారు. మండల కేంద్రంలో బుధవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆరు గ్యారంటీల పేరుతో తిరుగుతున్నారని.. కర్ణాటకలో అమలు చేయని పథకాలు తెలంగాణలో అమలు చేస్తామని చెబితే ప్రజలు నమ్మే స్థితిలో లేరన్నారు. ఆ పార్టీలో పదిమంది వరకు ముఖ్యమంత్రి అభ్యర్థులు ఉన్నారని ఎద్దేవా చేశారు. ఓటు అడిగే హక్కు ఒక్క బీఆర్‌ఎస్ పార్టీకే ఉందన్నారు. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో తమ పార్టీ అభ్యర్థులు భారీ మెజార్టీతో గెలవబోతున్నట్లు చెప్పారు. ఎవరెన్ని చేసినా కేసీఆర్ మూడోసారి ముఖ్యమంత్రి కావడం ఖాయ మని ఆయన ధీమా వ్యక్తం చేశారు. కాలె యాదయ్యను భారీ మెజార్టీతో గెలిపించేందుకు నియోజకవర్గ కార్యకర్తలంతా సైనికుల్లా పనిచేయాలని పిలుపునిచ్చారు. సమావేశంలో జెడ్పీటీసీ పట్నం అవినాశ్‌రెడ్డి, సర్ధార్‌నగర్ మార్కెట్ కమిటీ చైర్మన్ గూడూరు నర్సింగ్‌రావు, పార్టీ కార్యదర్శి శ్రీరాంరెడ్డి, సహకార సంఘం చైర్మన్ శేఖర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
మంత్రి పట్నం మహేందర్‌రెడ్డి