ఆర్థికాభివృద్ధి దిశగా.. | - | Sakshi
Sakshi News home page

ఆర్థికాభివృద్ధి దిశగా..

Nov 3 2026 12:39 AM | Updated on Nov 3 2026 12:39 AM

● ఎఫ్‌పీవోలుగా పీఏసీఎస్‌లు ● జిల్లాలో ఆరు సొసైటీలు ఎంపిక ● 50 మంది రైతులతో సభ్యత్వాలు ● కొనసాగుతున్న సభ్యత్వాల సేకరణ ఒక్కో సొసైటీలో 750 సభ్యత్వాలు ఏం వ్యాపారాలంటే.. మెరుగైన సేవలు..

సభ్యత్వాలు చేయిస్తున్నాం

● ఎఫ్‌పీవోలుగా పీఏసీఎస్‌లు ● జిల్లాలో ఆరు సొసైటీలు ఎంపిక ● 50 మంది రైతులతో సభ్యత్వాలు ● కొనసాగుతున్న సభ్యత్వాల సేకరణ

గంభీరావుపేట: రైతులను ఆర్థికంగా అభివృద్ధి చేయడం.. వ్యాపారులుగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల(పీఎసీఎస్‌)ను రైతు ఉత్పత్తి సంస్థ(ఎఫ్‌పీవో)లుగా మార్చేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ఈక్రమంలోనే జిల్లాలోని ఆరు సొసైటీలను ఎఫ్‌పీవోలుగా ఎంపిక చేసింది. గంభీరావుపేట, ఇల్లంతకుంట, వేములవాడ, అల్మాస్‌పూర్‌, సనుగుల, నాంపల్లి సొసైటీలను మొదటి విడతగా ఎఫ్‌పీవోలుగా మార్చనున్నారు. రైతులు స్వయంగా వ్యాపారం చేసుకోవడం, ఎక్విప్‌మెంట్‌లు కొనుగోలు చేసుకొని వ్యాపారాలు నిర్వహించుకొని ఆదాయాన్ని పెంపొందించుకునేందుకు ఫార్మర్‌ ప్రొడ్యూసింగ్‌ ఆర్గనైజేషన్స్‌(ఎఫ్‌పీవో)ను ఏర్పాటు చేస్తున్నారు.

రైతు ఉత్పత్తిదారుల సంస్థకు ఏర్పాటైన ఒక్కో సొసైటీలో 750 మంది రైతులకు సభ్యత్వం ఇవ్వనున్నారు. సభ్యత్వం పొందే రైతులు రూ.2వేలు చెల్లించాల్సి ఉంటుంది. ఇలా చెల్లించిన ప్రతీ సభ్యునికి కేంద్ర ప్రభుత్వం రూ.2వేలు చెల్లిస్తుంది. జిల్లాలో ఎంపికై న సొసైటీల పరిధిలో సభ్యత్వాల సేకరణ కొనసాగుతోంది. ఇలా రైతులు రూ.15లక్షలు సమకూర్చుకుంటే.. కేంద్ర ప్రభుత్వం రూ.15లక్షలు వాటా జమచేయనుంది. వీటితోపాటు రూ.2కోట్ల వరకు రూ.30లక్షలతో చేసిన వ్యాపారంలో వచ్చిన లాభాలను 750 మంది రైతులు అందుకోనున్నారు. ఇలా రైతుల ఆర్థికాభివృద్ధికి తోడ్పడనుంది. ఎఫ్‌పీవోలుగా మారిన ప్రతీ సొసైటీకి జాతీయ సహకార అభివృద్ధి సంస్థ, నాబార్డు సంస్థల నుంచి రుణ సౌకర్యం అందనుంది.

పంట ఉత్పత్తులను కొనుగోలు చేయడమే కాకుండా గ్రేడింగ్‌, ప్రాసెసింగ్‌ యూనిట్లు, కోల్డ్‌ స్టోరేజీలు, మినీ రైస్‌మిల్లులు, ప్యాకింగ్‌ కేంద్రాలు ఏర్పాటు చేయనున్నారు. ఈ కేంద్రాల నిర్వహణ ద్వారా వచ్చే ఆదాయంతో రైతులు ఆర్థికాభివృద్ధి సాధించేందుకు వీలుంది.

కొనుగోలు కేంద్రాలతోపాటు ఎరువుల విక్రయాల కు మొదట ఎఫ్‌పీవోలు ప్రాధాన్యం ఇవ్వనున్నా యి. దళారుల ప్రమేయం లేకుండా రైతుల నుంచి నేరుగా పంట ఉత్పత్తులు కొనుగోలు చేయనున్నా రు. వివిధ రకాల కంపెనీల నుంచి నేరుగా ఎరువులు, విత్తనాలు, రసాయనిక మందులను కొనుగో లు చేసి రైతులకు హోల్‌సేల్‌ ధరలకే విక్రయించనున్నారు. ఎఫ్‌పీవోలుగా మారితే సొసైటీల ద్వారా రై తులకు మరింత మెరుగైన సేవలు అందనున్నాయి.

మా సొసైటీ అధికారులు, సిబ్బంది, పాలకవర్గ సభ్యులు రైతులతో సభ్యత్వాలు నమోదు చేయించే ప్రక్రియలో నిమగ్నమయ్యాం. సంఘ పరిధిలో సీడ్‌ ప్రాసెసింగ్‌ యూనిట్‌ ఏర్పాటు చేయాలని నిర్ణయించుకున్నాం. రైతులకు అవగాహన కల్పిస్తున్నాం. 750 మంది సభ్యత్వాలకు 600లకు పైగా సభ్యత్వాలు చేయించాం. త్వరలోనే సభ్యత్వాలు పూర్తి చేస్తాం. – వేశాల వెంకటి,

సింగిల్‌విండో చైర్మన్‌, గంభీరావుపేట

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement