వేములవాడఅర్బన్: భీమేశ్వరస్వామిని ఎస్పీ మహేశ్ బీ గీతే కుటుంబ సమేతంగా సోమవారం దర్శించుకున్నారు. స్వామి వారికి కోడెమొక్కులు చెల్లించుకున్నారు. ఆలయ అర్చకులు ప్రసాదం అందజేశారు. ఈవో రమాదేవి, వేములవాడ టౌన్ సీఐ వీరప్రసాద్ ఉన్నారు.
సిరిసిల్లటౌన్: రెండో బైపాస్ రోడ్డు, కోనరావుపేట ప్రధాన రహదారి కలిసే చంద్రంపేట ట్రాఫిక్ సిగ్నల్ చౌరస్తా వద్ద ప్రమాదాల నివా రణకు చర్యలు చేపడతామని మున్సిపల్ చైర్‌పర్సన్ జిందం కళ పేర్కొన్నారు. స్థానిక కౌన్సి లర్లు మొగిలి నాగరాజు, బూర బాలు విజ్ఞప్తితో సోమవారం చౌరస్తాను పరిశీలించారు. రో డ్డు డివైడర్‌పై దారికి అడ్డంగా పెరిగిన చెట్లను తొలగిస్తామన్నారు. వాహనదారులూ నిబంధనలు పాటించాలని కోరారు. బీఆర్‌ఎస్ పట్టణ అధ్యక్షుడు జిందం చక్రపాణి, పాతూరి రాజిరెడ్డి, భాస్కర్‌రెడ్డి, శ్రీనివాస్ పాల్గొన్నారు.
ఎల్లారెడ్డిపేట: మండలంలోని హరిదాస్‌నగర్‌లో కమ్యూనిటీ పోలీసింగ్‌లో భాగంగా గ్రామపంచాయతీ సహకారంతో ఏర్పాటు చేసిన ఎనిమిది సీసీ కెమెరాలను సిరిసిల్ల డీఎస్పీ నాగేంద్రచారి సోమవారం ప్రారంభించారు. డీఎస్పీ మాట్లాడుతూ.. కమ్యూనిటీ, నేను సైతం పోలీసింగ్‌లో భాగంగా ప్రజల భాగస్వామ్యంతో జిల్లాలో నిరంతరంగా కొత్త సీసీ కెమెరాలను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. సీఐ వెంకటేశ్, ఎస్సై రమేశ్, సర్పంచుల ఫోరం మండల అధ్యక్షుడు దొమ్మాటి నర్సయ్య, ఏఎంసీ చైర్మన్ దేవానందం, వైస్‌చైర్మన్ నంది కిషన్ తదితరులు పాల్గొన్నారు.
రైతు కొడుకు..గోల్డ్ మెడలిస్ట్
వేములవాడరూరల్: వేములవా డ రూరల్ మండలం పోచెట్టిపల్లికి చెందిన రైతు బొడ్డు మల్లేశం కొడుకు వినయ్ ఎంబీబీఎస్‌లో గోల్డ్ మె డల్ సాధించా డు. చైన్నెలో ఎంబీబీఎస్ చదువుతున్న వినయ్‌కి యూనివర్సిటీ తరఫున గోల్డ్ మెడల్‌తో పాటు డిస్టింక్షన్ లభించినట్లు తెలిపారు. తన తండ్రి చేతుల మీదుగా మెడల్ అందుకోవడం ఆనందంగా ఉందని వినయ్ పేర్కొన్నారు.
సిరిసిల్ల: వేములవాడ ఐసీడీఎస్ ప్రాజెక్టు పరిధిలోని 12 అంగన్‌వాడీ కేంద్రాల్లో టీచర్ల భర్తీకి మంగళవారం ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నట్లు జిల్లా సంక్షేమాధికారి లక్ష్మీరాజం సోమవారం తెలిపారు. 12 అంగన్‌వాడీ కేంద్రాలకు 350 దరఖాస్తులు వచ్చాయని పేర్కొన్నారు. విద్యార్హతలు, స్థానికత, రిజర్వేషన్‌ల ఆధారంగా 9 కేంద్రాలలో 143 మంది అర్హత సాధించారని వివరించారు. మరో మూడు కేంద్రాల్లో అర్హులు లేరని పేర్కొన్నారు. కలెక్టరేట్‌లో జరిగే ఈ ఇంటర్వ్యూలకు 143 మంది అభ్యర్థులు ఉదయం 10 గంటలకు ఒరిజినల్ సర్టిఫి కెట్లు, గుర్తింపు పత్రాలతో హాజరుకావాలని సూచించారు. మెరిట్ ఆధారంగా, పారదర్శకంగా ఎంపిక ఉంటుందని తెలిపారు.
సిరిసిల్ల: నాణ్యమైన సన్న బియ్యం నిబంధనల మేరకు విక్రయించాలని జిల్లా పౌరసరఫరాల అధికారి తనూజ కోరారు. అధిక ధరలకు విక్రయిస్తే చర్యలు తీసుకుంటామని సోమవారం ప్రకటనలో హెచ్చరించారు. బీపీటీ బియ్యం కిలో రూ.66, ఆర్‌ఎన్‌ఆర్, తెలంగాణ సోనా రకం రూ.74, హెచ్‌ఎంటీ, జైశ్రీరాం రూ.79 కిలో చొప్పున విక్రయించాలని సూచించారు.


