వెల్లువలా దరఖాస్తులు | - | Sakshi
Sakshi News home page

వెల్లువలా దరఖాస్తులు

Nov 3 2026 12:39 AM | Updated on Nov 3 2026 12:39 AM

● వివిధ సమస్యలపై 165 విన్నపాలు ● అర్జీలు స్వీకరించిన కలెక్టర్‌ గరీమా అగ్రవాల్‌ డబుల్‌ బెడ్‌రూమ్స్‌ కేటాయించాలి ఆన్‌లైన్‌లో నమోదు చేయాలి పైపులు ఇప్పించండి ఆక్రమించిన వారిపై చర్యలు తీసుకోవాలి

● వివిధ సమస్యలపై 165 విన్నపాలు ● అర్జీలు స్వీకరించిన కలెక్టర్‌ గరీమా అగ్రవాల్‌

సిరిసిల్ల అర్బన్‌: కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన ప్రజావాణికి దరఖాస్తులు వెల్లువలా వచ్చాయి. జిల్లా నలుమూలల నుంచి వచ్చిన బాధితులు తమ సమస్యలను కలెక్టర్‌ గరీమా అగ్రవాల్‌ దృష్టికి తీసుకెళ్లారు. వివిధ సమస్యలపై 165 దరఖాస్తులు వచ్చాయి. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ ప్రజావాణి దరఖాస్తులను త్వరగా పరిష్కరించాలని సూచించారు. సిరిసిల్ల, వేములవాడ ఆర్డీవో కార్యాలయాల్లో 12 అర్జీలు, మండల పరిషత్‌లలో 37 దరఖాస్తులు వచ్చాయి.

జిల్లా కేంద్రంలోని శాంతినగర్‌ బైపాస్‌రోడ్డు పక్కన నిర్మించిన డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్లు అసాంఘిక కార్యక్రమాలకు అడ్డాగా మారుతున్నాయి. ప్రభుత్వం పట్టాలు ఇచ్చిన 202 దళిత కుటుంబాలకు డబుల్‌ బెడ్‌రూమ్స్‌ కేటాయించాలి. మిగిలినవి ఎంపిక చేసిన నిరుపేదలకు వెంటనే అందజేయాలి.

– అన్నారం సాయికుమార్‌,

సిరిసిల్ల

ఎల్లారెడ్డిపేట మండలం సింగారం శివారులో 34 గుంటల భూమిని కొనుగోలు చేశాను. అందులో నుంచి 13 గుంటలు మాత్రమే ఆన్‌లైన్‌లో కనిపిస్తుంది. ఇంకా 21 గుంటల భూమి ధరణి పాస్‌బుక్‌లో ఆన్‌లైన్‌ నమోదు కాలేదు. ఇప్పటికై నా నా భూమిని ఆన్‌లైన్‌లో నమోదు చేయించండి.

– పాశం లలిత, సిరిసిల్ల

మాది కొత్తగా ఏర్పాటైన గ్రామ పంచాయతీ గొల్లపల్లె(కొలనూరు). గ్రామ పంచాయతీలో డబ్బులు లేనందున తాగునీటికి ఉపయోగించే బోరు మోటార్‌, పైపులు బావిలోనే పడిపోయాయి. తాగునీటికి ఇబ్బంది అవుతుంది. బోరు, మోటార్‌, పైపులు ఇప్పించండి.

– బొజ్జం మల్లేశం,

గొల్లపల్లె(కొలనూరు) సర్పంచ్‌

సిరిసిల్ల మండలం సర్ధాపూర్‌లో గీతా పారిశ్రామిక సంఘానికి 4.27 ఎకరాలు కేటాయించారు. సల్లూరి బాలేల్లు అనే వ్యక్తి తన భూమిలో కాకుండా, పక్కనే ఉన్న గీతా పారిశ్రామిక సంఘం భూమిలోకి అక్రమంగా ప్రవేశించాడు. ఈ విషయంపై విచారణ చేపట్టి మాకు న్యాయం చేయండి.

– గీతా పారిశ్రామిక సంఘం, సర్దాపూర్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement