ఎల్లారెడ్డిపేట: మండల కేంద్రంలో ప్రధాన రహదారిపై అనుమతులు లేకుండా ఏర్పాటు చేసిన టేలాలు, మిర్చిబండ్లు, పూలదుకాణాలు, పండ్ల దుకాణాలను ఆదివారం తొలగించారు. మిర్చిబండ్లు, టేలాలు, ఇతర బోర్డులను పంచాయతీ అనుమతులు లేకుండా రోడ్లపై పెట్టారు. ఇటీవల గ్రామపంచాయతీ అధికారులు నోటీసులు జారీ చేశారు. అయినా తొలగించకపోవడంతో సర్పంచ్ ఎలగందుల నర్సింలు, ఈవో కృష్ణ, ఉపసర్పంచ్ బందారపు బాల్‌రెడ్డి ఆధ్వర్యంలో పంచాయతీ సిబ్బంది టేలాలు, మిర్చి, పండ్ల బండ్లు, రోడ్లపై ఉంచిన దుకాణాల బోర్డులను తొలగించారు.
దీన్ దయాల్ స్పర్ష్ యోజన స్కాలర్‌షిప్ పరీక్ష
సిరిసిల్ల టౌన్: భారత తపాలాశాఖ ఆధ్వర్యంలో కేంద్రం దీన్‌దయాల్ స్పర్ష్ యోజన స్కాలర్‌షిప్ పరీక్షను ఆదివారం సిరిసిల్లలో నిర్వహించారు. ప్రతీ సంవత్సరం 6, 7, 8, 9 తరగతుల విద్యార్థులకు స్కాలర్‌షిప్ అందించేందుకు ఈ పరీక్షను నిర్వహిస్తున్నారు. ప్రతీ సర్కిల్‌కు 40 మంది చొప్పున 23 తపాలా సర్కిళ్ల వ్యాప్తంగా 920 మందికి రూ.6వేల చొప్పున ఉపకార వేతనం అందజేయ నున్నారు. తపాలాశాఖ సిరిసిల్ల సబ్ డివిజన్ ఇన్‌స్పెక్టర్ ఆఫ్ పోస్ట్స్ వేణు పరిశీలించారు.
సూర్య నమస్కారాల సాధన
సిరిసిల్ల అర్బన్: కోటి సూర్య నమస్కార ప్రపంచ రికార్డు సాధనలో భాగంగా ఆది వారం సిరిసిల్లలోని కొత్తచెరువు పార్కులో యోగాభ్యాసనాలు నిర్వహించారు. యోగా శిక్షకుడు గూడూరి భాస్కర్, రాయిని ప్రతాప్, ఠాకూర్ రాజాసింగ్ ఆధ్వర్యంలో సూర్య నమస్కారాలు చేశారు. 2027 రథసప్తమి నాటికి ప్రతి ఒక్కరూ 116 సూర్య నమస్కారాలు చేసే స్థాయికి చేరుకోవాలన్నారు. యోగాను జీవితంలో భాగం చేసుకోవాలని జిల్లా యోగా ప్రచారక్ ఎలిగేటి కృష్ణ కోరారు.
నేడు అంగన్‌వాడీల కలెక్టరేట్ ముట్టడి
గంభీరావుపేట: డిమాండ్‌ల సాధనకు అంగన్‌వాడీలు పోరుబాట పడుతున్నారు. జిల్లా అంగన్‌వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ అసోసియేషన్(ఏఐటీయూసీ) ఆధ్వర్యంలో సోమవా రం కలెక్టరేట్ ముట్టడికి పిలుపునిచ్చారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న అంగన్‌వాడీ టీచర్లు, హెల్పర్లు తరలిరావాలని యూనియన్ నాయకులు కోరుతున్నారు. ఎన్నికల హామీలు ప్రతీ నెల రూ.26వేల వేతనం, బీమా రూ.25లక్షల సౌకర్యం, రూ.10వేల పెన్షన్, ఉద్యోగ విరమణ అనంతరం బెనిఫిట్స్ అందేలా చూడాలని కోరుతున్నారు. అసోసియేషన్ జిల్లా అధ్యక్షురాలు ఎదురుగట్ల మమత మాట్లాడుతూ మూడేళ్ల క్రితం సమ్మె చేసిన సమయంలో ఇ చ్చిన హామీలు ఇప్పటికీ అమలు కావడం లేదన్నారు. ప్రభుత్వం స్పందించి ఇప్పటికై నా తమ డిమాండ్లు నెరవేర్చాలని కోరారు. జిల్లా కేంద్రంలో నిర్వహించే మహాధర్నాకు అంగన్‌వాడీ ఉద్యోగులు తరలిరావాలని కోరారు.
రైతుల సంక్షేమమే లక్ష్యం
ఎల్లారెడ్డిపేట: రైతుల సంక్షేమమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తుందని రాచర్లబొప్పాపూర్ మార్కెట్ కమిటీ చైర్మన్ మేడిపల్లి దేవానందం పేర్కొన్నారు. మండలంలోని దుమాల, అక్కపల్లి గ్రామాల్లో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆదివారం ప్రారంభించారు. దేవానందం మాట్లాడుతూ.. రైతులు కొనుగోలు కేంద్రాల్లోనే ధాన్యం విక్రయించి మద్దతు ధర పొందాలన్నారు. కార్యక్రమంలో వైస్ చైర్మన్ నంది కిషన్, మండల సర్పంచుల ఫోరం కన్వీనర్ దొమ్మాటి నర్సయ్య, సర్పంచులు సోమారం శరవింద్, మాదాసు స్రవంతి, డైరెక్టర్లు, సర్పంచ్ బాపురెడ్డి, నాయకులు సద్ది లక్ష్మారెడ్డి, గుండాడి రాంరెడ్డి తదితరులు పాల్గొన్నారు.


