సిరిసిల్ల: ఉమ్మడి తెలుగు రాష్ట్రాల స్థాయిలో కడప జిల్లా కేంద్రంలో ఆదివారం నిర్వహించిన చిన్మయ గీతా పఠన పోటీలు–2026లో సిరిసిల్ల చిన్నారి ప్రతిభ కనబరిచింది. జిల్లా కేంద్రానికి చెందిన చిన్మయ బాలవిహార్ విద్యార్థిని మేర్గు మేధస్విత ఉమ్మడి తెలుగు రాష్ట్రాల స్థాయిలో తృతీయ బహుమతి సాధించింది. భగవద్గీత పఠనంలో మేధస్వితి ప్రతిభ చూపడంపై చిన్మయ మిషన్ సిరిసిల్ల అధ్యక్షుడు సజ్జనం శ్రీనివాస్, వర్కింగ్ ప్రెసిడెంట్ లకావత్ మోతిలాల్, ప్రధాన కార్యదర్శి నల్ల సత్యనారాయణ, కోశాధికారి మేరుగు మల్లేశం, కార్యవర్గ సభ్యులు కమలాకర్, రమేశ్, బుచ్చయ్య, శంకర్ అభినందనలు తెలిపారు. విద్యార్థిని తల్లిదండ్రులకు బాలవిహార్ ఆచార్యులు సత్యనారాయణకు ధన్యవాదాలు తెలిపారు.


