మూలవాగు ఆక్రమణల పంచాయితీ! | - | Sakshi
Sakshi News home page

మూలవాగు ఆక్రమణల పంచాయితీ!

Nov 2 2026 12:05 AM | Updated on Nov 2 2026 12:05 AM

బఫర్‌జోన్‌లో 30కి పైగా అక్రమ నిర్మాణాలు 25 ఇళ్లను గుర్తించిన మున్సిపల్‌ అధికారులు గతంలో ఐదు నిర్మాణాలు నేలమట్టం పాక్షికంగా మూడు కూల్చివేత కోర్టు స్టేతో నిలిచిన చర్యలు

వేములవాడ: వేములవాడ పట్టణ శివారులోని మూలవాగును ఆనుకుని అక్రమ నిర్మాణాలు మళ్లీ చర్చనీయాంశంగా మారాయి. వాగు పరివాహక ప్రాంతమైన బఫర్‌జోన్‌ నిబంధనలు పట్టించుకోకుండా దాదాపు 30కి పైగా భవనాలు నిర్మించారు. మున్సిపల్‌ అధికారులు చేపట్టిన సర్వేలో 25 ఇళ్లు బఫర్‌జోన్‌ పరిధిలోకి వస్తున్నట్లు గుర్తించారు. గతంలో కూల్చివేతలు చేపట్టిన అధికారులు ఐదు ఇళ్లను పూర్తిగా నేలమట్టం చేయగా, మరో మూడు ఇళ్లను పాక్షికంగా కూల్చివేశారు. మిగతా భవనాల యజమానులు హైకోర్టును ఆశ్రయించడంతో స్టే ఉత్తర్వులు వచ్చాయి. దీంతో కూల్చివేత చర్యలు నిలిచిపోయాయి.

మళ్లీ మొదలైన కలవరం

ప్రస్తుతం ఒకవైపు భారీ వర్షాలు, మరోవైపు ఎల్‌నినో ప్రభావం ముప్పు పొంచి ఉందన్న వాతావరణశాఖ హెచ్చరికల నేపథ్యంలో వాగు పొంగిపొర్లే ప్రమాదం ఉంది. ఈ నేపథ్యంలో బఫర్‌జోన్‌లో నిర్మించిన భవనాల భద్రత, వాగు సహజ ప్రవాహానికి ఏర్పడుతున్న ఆటంకాలపై స్థానికంగా చర్చ సాగుతోంది. ముంపు ముప్పు పొంచి ఉన్నందున అధికారులు తక్షణమే చర్యలు తీసుకోవాలనే డిమాండ్‌ వ్యక్తమవుతోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement