వరి వేయొద్దు.. ప్రత్యామ్నాయమే మేలు | - | Sakshi
Sakshi News home page

వరి వేయొద్దు.. ప్రత్యామ్నాయమే మేలు

Oct 17 2026 8:12 AM | Updated on Oct 17 2026 8:12 AM

● కలెక్టర్‌ గరీమా అగ్రవాల్‌

● కలెక్టర్‌ గరీమా అగ్రవాల్‌

సిరిసిల్ల: ప్రాజెక్టుల్లో నీటిమట్టాలు, భూగర్భ జలాలు క్రమంగా తగ్గుతుండడంతో ప్రభుత్వ ఆదేశాల మేరకు రైతులు వరి సాగు చేయొద్దని కలెక్టర్‌ గరీమా అగ్రవాల్‌ స్పష్టం చేశారు. ఎల్‌నినో ప్రభావాన్ని సమర్థంగా ఎదుర్కొనేందుకు సమగ్ర కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లో శుక్రవారం వ్యవసాయ, ఉద్యానవన, ఇరిగేషన్‌, మిషన్‌ భగీరథ, పశుసంవర్ధకశాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. మండలాల వారీగా నీటి లభ్యతను బట్టి కూరగాయలు, పప్పుదినుసులు, ఆయిల్‌పామ్‌ వంటి ప్రత్యామ్నాయ పంటల సాగుకు రైతులను ప్రోత్సహించాలని సూచించారు. తాగునీటి వృధాను అరికట్టేందుకు ప్రతీ నల్లాకు ఆన్‌/ఆఫ్‌ స్విచ్‌లు ఉండేలా చూడాలని అధికారులకు సూచించారు. గ్రామీణాభివృద్ధి శాఖ ద్వారా ‘తెలంగాణ జలసిరి’ కింద బోర్‌వెల్‌ రీచార్జ్‌ గుంతలు, ఫామ్‌పాండ్స్‌ పనులు వేగవంతం చేయాలన్నారు. మూగజీవాల కోసం గ్రామాల్లో నీటి తొట్లను ఎప్పటికప్పుడు నింపాలన్నారు. ముందస్తుగా పశుగ్రాసం విత్తనాలు సిద్ధం చేయాలని సూచించారు. ప్రొబేషనరీ డిప్యూటీ కలెక్టర్‌ నిఖిత, జిల్లా వ్యవసాయాధికారి అఫ్జల్‌ బేగం, సీపీవో సంపత్‌, డీపీవో వీరభద్రయ్య తదితరులు పాల్గొన్నారు.

రోడ్డు, ఆలయ పనులు వేగవంతం చేయాలి

వేములవాడ పట్టణంలో వీటీఏడీఏ ఆధ్వర్యంలో చేపడుతున్న రాజరాజేశ్వరస్వామి దేవస్థానం విస్తరణ, ఇతర అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని కలెక్టర్‌ ఆదేశించారు. ఆర్‌అండ్‌బీ, మున్సిపల్‌, దేవస్థానం, ఎన్పీడీసీఎల్‌ అధికారులతో టెలీ కాన్ఫరెన్స్‌ నిర్వహించారు.

మూలవాగు వంతెన నుంచి ఆలయం వరకు చేపడుతున్న 80 ఫీట్ల రోడ్డు నిర్మాణంలో భాగంగా విద్యుత్‌ టవర్ల పనులు వెంటనే పూర్తి చేసి రోడ్డు నిర్మించాలన్నారు. ఆలయ ఈవో రమాదేవి, ఆర్‌అండ్‌బీ ఈఈ భీమ్లానాయక్‌, మున్సిపల్‌ కమిషనర్‌ లోకేశ్‌, ఆలయ ఈఈ రాజేశ్‌ పాల్గొన్నారు.

ఆర్థిక అక్షరాస్యతపై అవగాహన కల్పించాలి

కేంద్ర ఆర్థిక సేవల విభాగం(డీఎఫ్‌ఎస్‌) ఆదేశాలతో ఈనెల 21 నుంచి డిసెంబర్‌ 31 వరకు అన్ని గ్రామపంచాయతీలు, మున్సిపాలిటీల్లో ఆర్థిక అక్షరాస్యత, డిజిటల్‌ మోసాలపై అవగాహన కల్పించాలని కలెక్టర్‌ ఆదేశించారు. లీడ్‌ బ్యాంక్‌ ఆధ్వర్యంలో రూపొందించిన ప్రచార పోస్టర్లను లీడ్‌ బ్యాంక్‌ మేనేజర్‌ రాజీవ్‌కుమార్‌తో కలిసి ఆవిష్కరించారు. కొత్తగా బ్యాంకు ఖాతాల ప్రారంభం, పీఎంజేడీవై ఖాతాలకు రీ–కేవైసీ చేయించడం, పొదుపు ఖాతాలు, లాకర్లకు నామినీ పేర్లను నమోదు చేయించడం వంటి పనులను షెడ్యూల్‌ ప్రకారం పూర్తి చేయాలన్నారు. సైబర్‌, డిజిటల్‌ మోసాల బారిన పడకుండా ప్రజలను చైతన్యవంతం చేయాలని బ్యాంకు అధికారులకు సూచించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement