తంగళ్లపల్లి: మండలంలోని పద్మనగర్ గ్రామపంచాయతీ పరిధి పద్మశాలీ సేవా సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వినాయక మండపంలో శుక్రవారం ముస్లిం యువకుడు సలీమ్ పూజలు చేశారు. వినాయకుడిని దర్శించుకుని ప్రసాదం స్వీకరించా రు. పద్మశాలీ సంఘం అధ్యక్షుడు మోర శ్రీకాంత్, కిరణ్, శ్రీహరి, శ్రీనివాస్, దేవేందర్ పాల్గొన్నారు.
ప్రశాంత వాతావరణంలో నిమజ్జనం
సిరిసిల్లటౌన్: కార్మికక్షేత్రంలో వినాయక నిమజ్జన మహోత్సవాన్ని సిరిసిల్ల మున్సిపల్ చైర్‌పర్సన్ జిందం కళ శుక్రవారం ప్రారంభించారు. మానేరుతీరంలో ఏర్పాటు చేసిన భారీ క్రేన్ల ద్వారా వినాయక ప్రతిమలను వాగులో నిమజ్జనం చేసే పనులకు శ్రీకారం చుట్టారు. లైటింగ్, భారీక్రేన్లు, పారిశుధ్య నిర్వహణ, తాగునీరు, సీసీ కెమెరాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. బీఆర్‌ఎస్ సిరిసిల్ల పట్టణ అధ్యక్షుడు జిందం చక్రపాణి తదితరులు పాల్గొన్నారు. ప్రెస్‌క్లబ్‌లో వినాయక పూజ ఉత్సవాల్లో చైర్‌పర్సన్ దంపతులు జిందం కళాచక్రపాణి, బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య, అక్కరాజు శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.


