పేదలకు పక్కా ఇళ్లు | - | Sakshi
Sakshi News home page

పేదలకు పక్కా ఇళ్లు

Sep 26 2026 7:35 AM | Updated on Sep 26 2026 7:35 AM

ప్రభుత్వ విప్‌ ఆది శ్రీనివాస్‌

సీఎం సభను విజయవంతం చేయాలి

చందుర్తి/కోనరావుపేట(వేములవాడ): పేదలకు పక్కా ఇళ్లు అందజేసి, వేములవాడ నియోజకవర్గాన్ని గుడిసెల రహిత గ్రామాలుగా తీర్చిదిద్దడమే కాంగ్రెస్‌ ప్రభుత్వ లక్ష్యమని ప్రభుత్వ విప్‌ ఆది శ్రీనివాస్‌ పేర్కొన్నారు. కోనరావుపేట, చందుర్తి మండల కేంద్రంలో శుక్రవారం పలువురికి ఇందిరమ్మ ఇళ్ల మంజూరుపత్రాలు, సీఎమ్మార్‌ఎఫ్‌, కల్యాణలక్ష్మీ చెక్కులు అందజేశారు. విప్‌ ఆది శ్రీనివాస్‌ మాట్లాడుతూ రాజన్న ఆలయ పనులు కొనసాగుతున్నాయన్నారు. రాష్ట్రాన్ని బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అప్పుల ఊబిలోకి నెట్టిందన్నారు. సీఎం రేవంత్‌రెడ్డి అభివృద్ధి, సంక్షేమం పనులు చేపడుతూ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో తీసుకెళ్తున్నారన్నారు.

కోనరావుపేటకు ఏం చేశారు?

సిరిసిల్లకు రూ.200 కోట్లతో యంగ్‌ ఇండియా ఇంటిగ్రేటెడ్‌ రెసిడెన్షియల్‌ స్కూల్‌, రూ.10 కోట్లతో తెలంగాణ పబ్లిక్‌ స్కూల్‌ మంజూరయ్యాయని ప్రభుత్వ విప్‌ తెలిపారు. కోనరావుపేటకూ తెలంగాణ పబ్లిక్‌ స్కూల్‌ మంజూరైనట్లు వివరించారు. కోనరావుపేట మండలం నుంచి ఎదిగిన నాయకులు ఈ ప్రాంత అభివృద్ధికి ఏమి చేశారో చెప్పాలని కోరారు. జూనియర్‌ కాలేజీ, మూలవాగు, పెంటవాగులపై వంతెనల నిర్మాణం కూడా చేయలేదన్నారు. సిరిసిల్లలో ఈనెల 30న జరిగే సీఎం రేవంత్‌రెడ్డి సభను విజయవంతం చేయాలని కోరారు. ఆయా కార్యక్రమాల్లో కిసాన్‌సెల్‌ జిల్లా అధ్యక్షుడు కేతిరెడ్డి జగన్మోహన్‌రెడ్డి, తహసీల్దార్‌లు భూపతి, వరలక్ష్మి, ఎంపీడీవో రాధ, పార్టీ మండల అధ్యక్షులు గొట్టే ప్రభాకర్‌, జిల్లా కార్యదర్శి చింతపంటి రామస్వామి, ఆత్మ కమిటీ చైర్మన్‌ ముస్కు ముకుందరెడ్డి, ఏఎంసీ చైర్మన్లు చెలుకల తిరుపతి, ఎల్లయ్య, సింగిల్‌ విండో చైర్మన్లు గసికంటి ప్రభాకర్‌, ఏగోళపు శ్రీనివాస్‌గౌడ్‌, భాస్కర్‌రావు, గంగాధర్‌, సర్పంచులు పులి సత్తయ్య, బొజ్జ మల్లేశం, కటకం మల్లేశం, మోకనపల్లి దేవరాజు, ఆవారి రమేష్‌, దూది మనీష, మానుక సత్యం పాల్గొన్నారు.

సీఎం సభను విజయవంతం చేయండి

వేములవాడఅర్బన్‌: ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సభను విజయవంతం చేయాలని ప్రభుత్వ విప్‌ ఆది శ్రీనివాస్‌ కోరారు. వేములవాడ అర్బన్‌ మండల కాంగ్రెస్‌ పార్టీ నాయకులతో శుక్రవారం సమావేశమయ్యారు. విప్‌ మాట్లాడుతూ గ్రామాల వారీగా బాధ్యతలు తీసుకున్న నాయకులు తాము ఇచ్చిన మాటకు కట్టుబడి జన సమీకరణ చేపట్టాలని కోరారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement