సీఎం పర్యటనకు పకడ్బందీగా ఏర్పాట్లు | - | Sakshi
Sakshi News home page

సీఎం పర్యటనకు పకడ్బందీగా ఏర్పాట్లు

Sep 26 2026 7:35 AM | Updated on Sep 26 2026 7:35 AM

కలెక్టర్‌ గరీమా అగ్రవాల్‌

సిరిసిల్ల: ఈనెల 30న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పర్యటన నేపథ్యంలో ఏర్పాట్లు పకడ్బందీగా చేయాలని కలెక్టర్‌ గరీమా అగ్రవాల్‌ ఆదేశించారు. సీఎం పర్యటన నేపథ్యంలో కలెక్టరేట్‌లో శుక్రవారం ఎస్పీ మహేశ్‌ బీ గీతే, అదనపు కలెక్టర్‌ గడ్డం నగేశ్‌తో కలి సి సమీక్షించారు. సీఎం రేవంత్‌రెడ్డి వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపన, రగుడు బైపాస్‌రోడ్‌ వద్ద ఉన్న మైదానంలో పబ్లిక్‌ మీటింగ్‌లో పాల్గొంటారని తెలిపారు. పోలీస్‌ అధికారులు ట్రాఫిక్‌, బందోబస్తు, భద్రత చర్యలు పూర్తి చేయాలన్నారు. జిల్లా రెవెన్యూ అధికారి జయశ్రీ, సిరిసిల్ల, వేములవాడ ఆర్డీవోలు శ్రీధర్‌బాబు, కేఎస్‌బీ కుమారి, ప్రొబేషనరీ డిప్యూటీ కలెక్టర్‌ నిఖిత పాల్గొన్నారు.

రాజన్న ఆలయ పనుల్లో వేగం పెంచాలి

వేములవాడ: రాజన్న ఆలయ విస్తరణ, అభివృద్ధి పనుల్లో వేగం పెంచాలని కలెక్టర్‌ ఆదేశించారు. వీటీఏడీఏ ఆధ్వర్యంలో చేపడుతున్న పనులు పరిశీలించారు. ఆలయ ఈవో రమాదేవి, ఆర్డీవో కేఎస్‌బీ కుమారి, ఆర్‌అండ్‌బీ ఈఈ భీమ్లానాయక్‌, ఆలయ ఈఈ రాజేశ్‌, ఆర్‌అండ్‌బీ డీఈ శాంతయ్య, మున్సిపల్‌ కమిషనర్‌ లోకేశ్‌, తహసీల్దార్‌ జయంత్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement