నేడు జిల్లాకు మంత్రులు రాక | - | Sakshi
Sakshi News home page

నేడు జిల్లాకు మంత్రులు రాక

Sep 26 2026 7:35 AM | Updated on Sep 26 2026 7:35 AM

సిరిసిల్ల: జిల్లాలో శనివారం రాష్ట్ర మంత్రులు పొన్నం ప్రభాకర్‌, వాకిటి శ్రీహరి పర్యటించనున్నారు. ఈమేరకు మంత్రుల పర్యటన షెడ్యూల్‌ శుక్రవారం జారీ అయింది. సిరిసిల్ల కాలేజీ మైదానంలో మధ్యాహ్నం 2 గంటలకు జరిగే ముదిరాజ్‌ సభలో మంత్రులు పాల్గొననున్నారు. 30వ తేదీన సిరిసిల్లలో జరిగే సీఎం రేవంత్‌రెడ్డి సభ నిర్వహణపై పార్టీ శ్రేణులతో మంత్రులు సమీక్షించనున్నారు.

తడగొండకు బతుకమ్మ తెప్ప మంజూరు

బోయినపల్లి(చొప్పదండి): మండలంలోని త డగొండలో బతుకమ్మ తెప్ప నిర్మాణానికి చొ ప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం రూ.5 లక్షలు మంజూరు చేశారు. ఈమేరకు పనుల మంజూరు ప్రొసీడింగ్‌ కాపీలను సర్పంచ్‌ ఉయ్యా ల శ్రీనివాస్‌కు శుక్రవారం అందజేశారు. ఉపసర్పంచ్‌ చేపూరి వెంకటేశ్‌, ప్యాక్స్‌ డైరెక్టర్‌ గుడి శ్రీనివాస్‌రెడ్డి, చేపూరి కనకయ్య, రెండ్ల లచ్చయ్య, మండల శ్రీనివాస్‌ పాల్గొన్నారు.

పోషకాహారంతోనే ఆరోగ్యం

గంభీరావుపేట(సిరిసిల్ల): పోషకాహారంతోనే ఆరోగ్యం లభిస్తుందని సీడీపీవో సబిత పేర్కొన్నారు. మండలంలోని నర్మా ల, నాగంపేటలో ఐసీడీఎస్‌ ఆధ్వర్యంలో శుక్రవారం పోషణ మాసోత్సవాలు నిర్వహించా రు. ఏసీడీపీవో ఉమారాణి, ఎంపీడీవో రాజేందర్‌, ఐసీడీఎస్‌ సూపర్‌వైజర్లు స్వరూప, కళా వతి, సర్పంచులు రాజబోయిన అర్చన, రాజి రెడ్డి, ఉపసర్పంచ్‌ సుదర్శన్‌, టీచర్లు అంజలి, పద్మ, శోభారాణి, హెచ్‌ఎం శ్రీనివాస్‌ పాల్గొన్నారు.

అనంతగిరి పోచమ్మ గుడిలో మహా చండీయాగం

ఇల్లంతకుంట(మానకొండూర్‌): అనంతగిరి పోచమ్మ ఆలయం ఏడో వార్షికోత్సవం సందర్భంగా శనివారం మహాచండీ యాగం నిర్వహిస్తున్నట్లు ఆలయ ఈవో మారుతీరావు తెలిపారు. అమ్మవారికి అభిషేకాలు, గణపతి పూజ, చండీ పారాయణం, పూర్ణాహుతి నిర్వహించనున్నట్లు వివరించారు.

సమస్యలు పరిష్కరించండి

సిరిసిల్ల అర్బన్‌: ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి జిల్లా పర్యటన సందర్భంగా పవర్‌లూమ్‌ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి కాడారి రాములు కోరారు. ఏఐటీయూసీ జిల్లా కార్యాలయంలో శుక్రవారం విలేకరులతో మాట్లాడారు. స్థానిక కార్మికులకే చీరల ఉపాధి కల్పించాలని, వర్క్‌ టు ఓనర్‌ పథకం అమలు చేయాలని కోరారు. కనీస వేతనం చెల్లించాలని, ఇందిరా మహిళాశక్తి చీరలకు 10 శాతం యారన్‌ సబ్సిడీ ఇవ్వాలని విన్నవించారు. నాయకులు అజ్జ వేణు, ఎనగందుల రాజు, ఆనందం పాల్గొన్నారు.

నిర్వాసితుల సమస్యలు పరిష్కరించండి

సిరిసిల్ల అర్బన్‌: మధ్యమానేరు ప్రాజెక్టులో ముంపునకు గురైన నిర్వాసితుల సమస్యలు పరిష్కరించాలని సీపీఐ జిల్లా నాయకుడు గుంటి వేణు కోరారు. కలెక్టరేట్‌లో జిల్లా అదనపు కలెక్టర్‌ గడ్డం నగేశ్‌కు మధ్యమానేరు నిర్వాసితుల సమస్యలపై శుక్రవారం వినతిపత్రం అందజేశారు. వారు మాట్లాడుతూ నిర్వాసిత కుటుంబాలకు పరిహారం, ప్యాకేజీలు అందించాలన్నారు. సోమ నాగరాజు, ఎలగందుల రాజు పాల్గొన్నారు.

కాటన్‌ చీరల కార్మికుల నిరసన

సిరిసిల్లటౌన్‌: కాటన్‌ చీరల యజమానులపై ఎన్‌ఫోర్స్‌మెంట్‌, ఏసీబీ అధికారులు చర్యలు తీసుకోవాలని పవర్‌లూమ్స్‌ వర్కర్స్‌ యూనియన్‌(సీఐటీయూ) రాష్ట్ర అధ్యక్షుడు మూశం రమేశ్‌ డిమాండ్‌ చేశారు. సిరిసిల్ల చేనేత, జౌళి శాఖ ఆఫీస్‌ వద్ద చేనేత వస్త్రాలను పవర్‌లూమ్స్‌పై ఉత్పత్తి చేస్తున్న యజమానుల తీరును నిరసిస్తూ శుక్రవారం ధర్నా చేపట్టారు. నెల రోజులుగా సమ్మె చేస్తుంటే పట్టించుకోవడం లేదన్నారు. జిల్లా అధ్యక్షుడు కోడం రమణ, చిరంజీవి, వీరేశం, మార్కండేయులు, ప్రతాప్‌, ఆనందం, శ్రీనివాస్‌, కనకయ్య తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement