కొడుకు, అమ్మ చనిపోయారు | - | Sakshi
Sakshi News home page

కొడుకు, అమ్మ చనిపోయారు

Sep 11 2026 11:09 AM | Updated on Sep 11 2026 11:09 AM

కొడుకు, అమ్మ చనిపోయారు

ఆ దుర్ఘటన జరిగిన రోజు మా బాబు అరుణ్‌ సాయి(5)కి జ్వరం రావడంతో మా అమ్మ భాగ్యమ్మ(45)తో కలిసి హాస్పిటల్‌కు బస్సులో బయల్దేరాం. కిక్కిరిసిన బస్సు అదుపుతప్పడంతో అందరూ అరవడం మాత్రమే గుర్తుంది. లేచేసరికి హాస్పిటల్లో బెడ్‌పై ఉన్నాను. ఈ ప్రమాదంలో నా కొడుకు అరుణ్‌సాయి, మా అమ్మ భాగ్యమ్మను కోల్పోయాను. ఆ విషయం రెండు రోజుల వరకు నాకు చెప్పలేదు. నా కొడుకు వయసు ఉన్న స్కూల్‌కి వెళ్లే పిల్లలను చూస్తే ప్రాణం విలవిల్లాడుతోంది. చేతికి పలుచోట్ల రాడ్లు పడడంతో ఏ పని చేయలేకపోతున్నాను. నేను ఇంటర్‌ వరకు చదువుకున్నాను. ప్రభుత్వం దయ తలసి ఏదైనా చిన్న ఉద్యోగం ఇప్పించాలని కోరుతున్నాను.

– కొండ శైలజ, హిమ్మత్‌రావుపేట

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement