గణేశ్‌ నవరాత్రులు వైభవంగా నిర్వహిద్దాం | - | Sakshi
Sakshi News home page

గణేశ్‌ నవరాత్రులు వైభవంగా నిర్వహిద్దాం

Sep 11 2026 11:09 AM | Updated on Sep 11 2026 11:09 AM

● ధాన్యం కొనుగోళ్లకు ఏర్పాటు చేయాలి ● కలెక్టర్‌ గరీమా అగ్రవాల్‌

● ధాన్యం కొనుగోళ్లకు ఏర్పాటు చేయాలి ● కలెక్టర్‌ గరీమా అగ్రవాల్‌

సిరిసిల్ల: గణేశ్‌ నవరాత్రి ఉత్సవాలు వైభవంగా నిర్వహిద్దామని కలెక్టర్‌ గరీమా అగ్రవాల్‌ కోరారు. కలెక్టరేట్‌లో గురువారం ఎస్పీ మహేశ్‌ బీ గీతే, అదనపు కలెక్టర్‌ గడ్డం నగేశ్‌లతో కలిసి సమీక్షించారు. కలెక్టర్‌ మాట్లాడుతూ అన్ని శాఖల అధికారులు సమన్వయంతో గణేశ్‌ నవరాత్రి వేడుకలు విజయవంతంగా నిర్వహించాలని ఆదేశించారు. మున్సి పల్‌, విద్యుత్‌, మత్స్య, పోలీస్‌, రవాణా, ఆర్‌ అండ్‌ బీ, నీటి పారుదల, వైద్య ఆరోగ్య శాఖల ఆధ్వర్యంలో చేపట్టే ఏర్పాట్లపై చర్చించారు. నిమజ్జనం సందర్భంగా క్రేన్స్‌, జేసీబీలు, విద్యుత్‌దీపాలు, నీటి సదుపాయం కల్పించాలని ఆయా శాఖల అధికారులను ఆదేశించారు. ఎస్పీ మహేశ్‌ బీ గీతే మాట్లాడుతూ మండపాల నిర్వాహకులు తమ వివరాలు పోలీస్‌ శాఖ వెబ్‌సైట్‌లో నమోదు చేయాలని సూచించారు. ఆర్డీవోలు శ్రీధర్‌బాబు, కేఎస్‌బీ కుమారి, డీఎస్పీలు నాగేంద్రచారి, శ్రీనివాసులు, ప్రొబేషనరీ డిప్యూటీ కలెక్టర్‌ నిఖిత, జిల్లా రవాణా శాఖ అధికారి శ్రీనివాస్‌, జిల్లా ఎకై ్సజ్‌ శాఖ అధికారి హిమశ్రీ, జిల్లా అగ్నిమాపక శాఖ అధికారి శ్రీని వాస్‌రెడ్డి, జిల్లా వైద్యాధికారి ఏంజెలా ఆల్ఫ్రెడ్‌, ఈఈ పీఆర్‌ సుదర్శన్‌రెడ్డి, నీటి పారుదల శాఖ అధికారి దయాకర్‌, వేములవాడ మున్సిపల్‌ కమిషనర్లు ఖదీర్‌పాషా, లోకేశ్‌, తహసీల్దార్లు మహేశ్‌, జయంత్‌, కలెక్టరేట్‌ పర్యవేక్షకులు ప్రవీణ్‌ పాల్గొన్నారు.

ఖరీఫ్‌ ధాన్యం

కొనుగోళ్ల ప్రణాళిక సిద్ధం చేయాలి

జిల్లాలో ఖరీఫ్‌(వానాకాలం) సీజన్‌ ధాన్యం కొనుగోళ్లకు ప్రణాళిక సిద్ధం చేయాలని కలెక్టర్‌ ఆదేశించారు. జిల్లాలో 2.40 లక్షల టన్నుల ధాన్యం దిగుబడి వస్తుందని, 236 కేంద్రాలు ఏర్పాటు చేయాలన్నారు. అక్టోబరు చివరి వారంలో వడ్లు చేతికి వస్తాయని గన్నీసంచులు, ప్యాడీ క్లీనర్లు, వెయింగ్‌ మి షన్లు, తేమయంత్రాలు సిద్ధం చేయాలని, లారీల కాంట్రాక్టర్లు ఒప్పందం మేరకు లారీలను సిద్ధం చే యాలని సూచించారు. అదనపు కలెక్టర్‌ గడ్డం నగే శ్‌, సిరిసిల్ల, వేములవాడ ఆర్డీవోలు శ్రీధర్‌బాబు, కేఎస్‌బీ కుమారి, డీసీఎస్‌వో బుచ్చిబాబు, డీఎం గోపాల్‌, డీఆర్డీవో లక్ష్మీనారాయణ, జిల్లా సహకారశాఖ అధికారి రామకృష్ణ, వ్యవసాయశాఖ అధికారి అఫ్జల్‌ బేగం, జిల్లా మార్కెటింగ్‌శాఖ అధికారి ప్రకాశ్‌, మార్క్‌ఫెడ్‌ అధికారి హబీబ్‌ పాల్గొన్నారు.

ఆరోగ్య ఉపకేంద్రాలు పూర్తిచేయాలి

జిల్లాలో ఆరోగ్య ఉపకేంద్రాల పనులు పూర్తి చేయాలని కలెక్టర్‌ ఆదేశించారు. ఎన్‌హెచ్‌ఎం, 15వ ఆర్థిక సంఘం నిధులు ఇతర నిధులతో చేపట్టిన పనులపై సమీక్షించారు. 10 ఆరోగ్య ఉపకేంద్రాలు ప్రారంభానికి సిద్ధంగా ఉన్నాయని, మరో ఆరు భవనాలు తుది దశలో ఉన్నాయని అధికారులు వివరించారు. పీఆర్‌ ఈఈ సుదర్శన్‌రెడ్డి, టీజీఎంఎస్‌ ఐడీసీ ఈఈ విశ్వప్రసాద్‌, జిల్లా వైద్యాధికారి ఏంజెలా ఆల్ఫ్రెడ్‌ పాల్గొన్నారు.

ఆత్మహత్యల నివారణ పోస్టర్‌ ఆవిష్కరణ

మానసిక ఒత్తిడి, మానసిక సమస్యలతో బాధపడేవారు మనోధైర్యంతో ముందుకుసాగాలని కలెక్టర్‌ కోరారు. ఆత్మహత్యల నివారణ దినం సందర్భంగా కలెక్టరేట్‌లో టోల్‌ ఫ్రీ నంబర్‌ 14416 పోస్టర్లను ఎస్పీ మహేశ్‌ బీ గీతే, అదనపు కలెక్టర్‌ గడ్డం నగేశ్‌, జిల్లా వైద్యాధికారి ఏంజెలా ఆల్ఫ్రెడ్‌తో కలిసి ఆవిష్కరించారు. డాక్టర్‌ నయీమా జహా ఉన్నారు.

మట్టి వినాయక విగ్రహాలను పూజించాలి

పర్యావరణ పరిరక్షణలో భాగంగా మట్టితో తయారు చేసిన వినాయక విగ్రహాలను పూజించాలని కలెక్టర్‌ కోరారు. కలెక్టరేట్‌లో తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి ఉచితంగా మట్టి వినాయక విగ్రహాల పంపిణీ కార్యక్రమాన్ని కలెక్టర్‌, ఎస్పీ చేతుల మీదుగా ప్రారంభించారు. మట్టివిగ్రహాలను పూజించాలనే పోస్టర్లను ఆవిష్కరించారు. జిల్లాలో రెండు వేల మట్టి విగ్రహాలను పంపిణీ చేస్తామన్నారు. తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి ఏఈఈ శ్రావణ్‌ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement