బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేల సస్పెన్షన్‌ ఎత్తివేయాలి | - | Sakshi
Sakshi News home page

బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేల సస్పెన్షన్‌ ఎత్తివేయాలి

Sep 11 2026 11:09 AM | Updated on Sep 11 2026 11:09 AM

● పార్టీ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య

● పార్టీ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య

సిరిసిల్లటౌన్‌: బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేల సస్పెన్షన్‌ను ఎత్తివేయాలని పార్టీ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య డిమాండ్‌ చేశారు. సిరిసిల్లలోని తెలంగాణ భవన్‌లో గురువారం ప్రెస్‌మీట్‌లో మాట్లాడారు. ఎరవెల్లిలో కేసీఆర్‌ ఇంటిపైకి కాంగ్రెస్‌ రౌడీలు, గూండాలను రేవంత్‌ స ర్కారు ఉసిగొల్పడం దారుణమన్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో ఉద్యమకారులపై గన్నుపెట్టిన చరిత్ర రేవంత్‌రెడ్డిదన్నారు. చావు నోట్ల తలపెట్టి తెలంగాణ సాధించిన చరిత్ర కేసీఆర్‌ది అని గుర్తు చేశారు. రానున్న రోజుల్లో రేవంత్‌రెడ్డికి గుణపాఠం చెప్పేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌ దార్ల సందీప్‌, నాయకులు బొల్లి రా మ్మోహన్‌, మీసరగండ్ల అనిల్‌కుమార్‌, కుంబా ల మల్లారెడ్డి, దిడ్డి రాజు, మ్యాన రవి, బాలమ ల్లు, సాయికుమార్‌, కందుకూరి రామాగౌడ్‌, అనిల్‌గౌడ్‌, మొగిలి నాగరాజు పాల్గొన్నారు.

ఒత్తిడి లేని జీవితం గడపాలి

సిరిసిల్లటౌన్‌: కార్మికులు ఒత్తిడి లేని జీవితం గడపాలని సైకాలజిస్ట్‌ కె.పున్నంచందర్‌ పేర్కొన్నారు. ప్రపంచ ఆత్మహత్యల నివారణ దినోత్సవం సందర్భంగా జిల్లా కేంద్రంలో గురువారం అవగాహన సదస్సు నిర్వహించారు. సమస్యలు ఎదురైనప్పుడు ఒంటరిగా భరించకుండా కుటుంబ సభ్యులు, స్నేహితులు, నిపుణులతో తమ ఆలోచనలు, భావాలను పంచుకోవాలని సూచించారు. సామాజిక కార్యకర్త వేముల మార్కండేయులు, మైండ్‌ కేర్‌ అండ్‌ కౌన్సెలింగ్‌ సెంటర్‌ సిబ్బంది రాపెల్లి లత, బూర శ్రీమతి, కొండ ఉమ తదితరులు పాల్గొన్నారు.

ఆలయ అభివృద్ధికి విరాళం

వేములవాడ: రాజన్న ఆల అభివృద్ధి, విస్తరణ పనులకు మహారాష్ట్రలోని పర్భణికి చెందిన మనోజ్‌ ప్రకాశ్‌రావు రూ.51,111 విరాళంగా అందించారు. ఆలయ అకౌంట్స్‌ అడ్వయిజర్‌ ఆగంరావుకు గురువారం అందజేశారు. అనంతరం దాతకు అర్చకులు స్వామి వారి ప్రసాదం, ఆశీర్వచనం అందించారు.

సాయుధ పోరాట వారోత్సవాలు

సిరిసిల్లటౌన్‌: వీరనారి చాకలి ఐలమ్మ స్ఫూర్తి తో సిరిసిల్లలో వారం రోజులపాటు తెలంగాణ సాయుధ పోరాట వారోత్సవాలు నిర్వహించనున్నట్లు సీపీఎం జిల్లా కార్యదర్శి మూశం రమేశ్‌ పేర్కొన్నారు. సిరిసిల్లలో చాకలి ఐలమ్మ విగ్రహానికి గురువారం నివాళి అర్పించి మాట్లాడారు. భూమి కోసం, భుక్తి కోసం, వెట్టిచాకిరీ విముక్తి కోసం జరిగిన పోరాట స్ఫూర్తితో జిల్లాలోని సమస్యలపై పోరాడుతామన్నారు. నాయకులు సూరం పద్మ, ఎలిగేటి రాజశేఖర్‌, శ్రీరాం సదానందం, బింగి సంపత్‌, ఆడెపు రజిత, పులి గోపాల్‌, గుండేటి వెంకటేశం, వడ్నాల వీరేశం, బోనాల రాజు, చిరంజీవులు, మార్కండేయులు పాల్గొన్నారు.

మండపాల వద్ద నిబంధనలు పాటించాలి

సిరిసిల్ల అర్బన్‌: గణేశ్‌ మండపాల వద్ద విద్యుత్‌ భద్రత నిబంధనలు పాటించాలని జిల్లా ఎస్‌ఈ శ్రీనివాస్‌రావు సూచించారు. మండపాల నిర్వాహకులు విగ్రహం ఎత్తును విద్యుత్‌ శాఖకు తెలియజేయాలని కోరారు. లైన్ల కింద మండపాలు ఏర్పాటు చేయరాదని, నాణ్యమైన వైర్లు, సరైన ఎర్తింగ్‌ వినియోగించాలని సూచించారు. స్తంభాలకు మండపాలు తగలకుండా చూడాలని, సర్వీస్‌ కేబుళ్లకు హుక్కులు ఉపయోగించరాదన్నారు. తడి చేతులతో స్విచ్‌లు, బోర్డులు తాకవద్దని తెలిపారు. మండపాల వద్ద వలంటీర్లను అందుబాటులో ఉంచాలన్నారు. ప్రమాదాలు జరిగిన వెంటనే విద్యుత్‌ టోల్‌ ఫ్రీ 1912కు సమాచారం అందించాలని కోరారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement