మండలం 2026 2025 ఫిబ్రవరి ఫిబ్రవరి
బోయినపల్లి 6.30 7.21
చందుర్తి 6.14 5.23
గంభీరావుపేట 9.64 11.59
ఇల్లంతకుంట 5.76 5.90
కోనరావుపేట 8.59 9.72
ముస్తాబాద్ 10.38 9.79
రుద్రంగి 7.20 5.31
సిరిసిల్ల 13.09 11.65
తంగళ్లపల్లి 6.98 7.87
వీర్నపల్లి 15.74 13.45
వేములవాడరూరల్ 5.10 4.77
వేములవాడఅర్బన్ 14.41 13.18
ఎల్లారెడ్డిపేట 15.04 15.62
జిల్లా సగటు 9.08 9.28
ఇది కోనరావుపేట మండలం బావుసాయిపేట కొత్తకుంట. యాసంగి సీజన్ ఆరంభంలో నిండా నీటితో ఉన్న ఈ కుంట ఇప్పుడు ఇలా ఎండిపోయింది. సాగునీటి వనరులైన చెరువులు, కుంటలు, వాగులు, బోర్లు, బావులు ఎండిపోవడంతో వాటిని నమ్ముకుని యాసంగి సీజన్‌లో సాగుచేసిన పొలాలు చి‘వరి’కి బీటలు వారాయి. ఇలా జిల్లా వ్యాప్తంగా దాదాపు 20వేల ఎకరాల్లో వరి పొలాలు ఎండిపోయాయి. మరో పక్షం రోజుల్లో మరిన్ని పొలాలు ఎండిపోయే ప్రమాదం ఉందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.


