సిరిసిల్లలో పందుల సంచారంపై నిషేధం | - | Sakshi
Sakshi News home page

సిరిసిల్లలో పందుల సంచారంపై నిషేధం

Mar 16 2026 7:41 AM | Updated on Mar 16 2026 7:41 AM

● పెద్దూరులో కేటాయించిన స్థలంలో పెంచుకోవాలి ● మున్సిపల్‌ కమిషనర్‌ ఖదీర్‌పాషా ● ప్రభుత్వ విప్‌ ఆది శ్రీనివాస్‌

● పెద్దూరులో కేటాయించిన స్థలంలో పెంచుకోవాలి ● మున్సిపల్‌ కమిషనర్‌ ఖదీర్‌పాషా

సిరిసిల్లటౌన్‌: జిల్లా కేంద్రంలో పందుల సంచారం నిషేధించినట్లు మున్సిపల్‌ కమిషనర్‌ ఎం.ఎ.ఖదీర్‌పాషా తెలిపారు. మున్సిపల్‌ ఆధ్వర్యంలో పెద్దూరులో ప్రత్యేకంగా కేటాయి ంచిన స్థలంలో పెంచుకోవాలని సూచించారు. పందులను రోడ్లపై వదిలేస్తున్నారని ఫిర్యాదులు వచ్చాయని, జనావాస ప్రాంతాల్లో వదిలేస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు.

లబ్ధిదారుల ముఖాల్లో ఇందిరమ్మ వెలుగులు

వేములవాడ రూరల్‌: పేదల సొంతింటి కల సాకారం చేయడమే ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర ప్రభుత్వ విప్‌ ఆది శ్రీనివాస్‌ పేర్కొన్నారు. వేములవాడరూరల్‌ మండలం బొల్లారం, బాలరాజ్‌పల్లి గ్రామాల్లో ఆదివారం ఇందిరమ్మ గృహ ప్రవేశాలకు హాజరయ్యారు. లబ్ధిదారులకు నూతన వస్త్రాలు అందజేశారు.

చందుర్తి(వేములవాడ): మండలంలోని మూడపల్లిలో ఇందిరమ్మ గృహప్రవేశానికి ప్రభుత్వ విప్‌ ఆది శ్రీనివాస్‌ హాజరై, లబ్ధిదారులు వట్టిమల్ల భాగమ్మ– బాలయ్య దంపతులకు నూత న వస్త్రాలను అందజేశారు. విప్‌ శ్రీనివాస్‌ మాట్లాడుతూ బీఆర్‌ఎస్‌ పదేళ్ల పాలనలో నిరుపేదకు ఇళ్లు ఇచ్చిన దాఖలాలు లేవన్నారు.

జాతీయ పోటీలకు ఎంపిక

జాతీయ పోటీలకు ఎంపికై న వాలీబాల్‌ క్రీడాకారులు

సిరిసిల్లటౌన్‌: జాతీయ వాలీబాల్‌ పోటీలకు ఎంపికై న క్రీడాకారులకు అభినందనలు వెల్లువెత్తాయి. ఇటీవల వేములవాడలో జరిగిన 8వ తెలంగాణ యూత్‌ వాలీబాల్‌ రాష్ట్ర స్థాయి పోటీల్లో వివిధ జిల్లాల నుంచి పాల్గొని ప్రతిభ కనబరిచారు. ఈనెల 16 నుంచి భువనేశ్వర్‌లో జరిగే జాతీయ స్థాయి పోటీలకు ఎంపికై న ఉమ్మడి కరీంనగర్‌ జిల్లా జట్టు సభ్యులు టి.శ్రునిక్‌, ఎస్‌.వేణు, డి.మమతతోపాటు జాతీయ జట్టుకి మెన్‌ హెడ్‌ కోచ్‌గా జి.సంపత్‌గౌడ్‌, అసిస్టెంట్‌ కోచ్‌గా రాజశేఖర్‌, విమెన్‌ హెడ్‌ కోచ్‌ ప్రభాకర్‌, అసిస్టెంట్‌ కోచ్‌ అఖిల ఎంపికయ్యారు. వీరిని ఉమ్మడి జిల్లా క్రీడాకారుల సంక్షేమ సంఘం కార్యదర్శి గిన్నె లక్ష్మణ్‌, జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు శ్రీకుమార్‌, రాందాస్‌ అభినందించారు.

ఐక్యతతోనే సమస్యలు పరిష్కారం

సిరిసిల్లటౌన్‌: ఐక్యంగా ఉండి సమస్యలు పరిష్కరించుకుంటామని సెస్‌ అసిస్టెంట్‌ హెల్పర్ల సంఘం జిల్లా అధ్యక్షుడు కర్నాల అనిల్‌కుమార్‌ పేర్కొన్నారు. సిరిసిల్ల ప్రెస్‌క్లబ్‌లో ఆదివారం ప్రెస్‌మీట్‌లో మాట్లాడారు. ఇటీవల చేపట్టిన 72 గంటల దీక్షకు మద్దతు తెలిపిన సీఐటీయూ నేతలకు కృతజ్ఞతలు తెలియజేశారు. చాలీచాలని వేతనాలతో ప్రాణాలను ఫణంగా పెట్టి సెస్‌లో విధులు నిర్వహిస్తున్నామన్నారు. 72 గంటల విధుల బహిష్కరణ సందర్భంగా 10 డిమాండ్లకు ఆరింటికి ఒప్పందం చేసుకున్నట్లు తెలిపారు. తమకు మద్దతుగా నిలిసిన వారందరికి కృతజ్ఞతలు అని పేర్కొన్నారు. నర్ర శ్రీనివాస్‌రెడ్డి, ఎర్ర మల్లేశం, అనిల్‌కుమార్‌, ఎర్ర శ్రీనివాస్‌, పిట్టల మల్లేశ్‌, కిషన్‌, దోర్నాల అంజిరెడ్డి పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement