న్యూస్‌రీల్
ప్రశాంతంగా
పదో తరగతి పరీక్షలు
సిరిసిల్ల: జిల్లాలో పదో తరగతి పరీక్షలు తొలిరోజు శనివారం ప్రశాంతంగా జరిగాయి. 34 పరీక్ష కేంద్రాలు ఉండగా.. 7,307 మందికి ఎనిమిది మంది విద్యార్థులు గైర్హాజరయ్యారు. జిల్లాలో 99.89 శాతం విద్యార్థుల హాజరు నమోదైంది. కలెక్టర్ గరీమా అగ్రవాల్ బాలుర జెడ్పీ హైస్కూల్, నెహ్రూ నగర్ హైస్కూల్‌ను తనిఖీ చేశారు. ఎస్పీ మహేశ్ బీ గీతే గీతానగర్ బాలికల జెడ్పీ హైస్కూల్ కేంద్రాన్ని డీఎస్పీ నాగేంద్రచారితో కలిసి పరిశీలించారు. రెండు ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలు 10 పరీక్ష కేంద్రాలను సందర్శించినట్లు జిల్లా విద్యాధికారి డాక్టర్ బి.జగన్‌మోహన్‌రెడ్డి తెలిపారు.


