వాలీబాల్‌ అసిస్టెంట్‌ కోచ్‌గా రాజశేఖర్‌ | - | Sakshi
Sakshi News home page

వాలీబాల్‌ అసిస్టెంట్‌ కోచ్‌గా రాజశేఖర్‌

Mar 15 2026 1:02 AM | Updated on Mar 15 2026 1:02 AM

ఇల్లంతకుంట(మానకొండూర్‌): మండల కేంద్రానికి చెందిన చేరాల రాజశేఖర్‌ జాతీయస్థాయిలో తెలంగాణ యూత్‌ వాలీబాల్‌ టీం అసిస్టెంట్‌ కోచ్‌గా నియమితులయ్యారు. భువనేశ్వర్‌లో జరిగే యూత్‌ జాతీయ స్థాయి వాలీబాల్‌ పోటీలకు రాష్ట్ర బాలుర జట్టుకు కోచ్‌గా వ్యవహరించనున్నారు. రాజశేఖర్‌ ప్రస్తుతం ముస్తాబాద్‌ పోలీస్‌స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్నారు. తనను కోచ్‌గా ఎంపిక చేసినందుకు రాష్ట్ర వాలీబాల్‌ అసోసియేషన్‌ కార్యదర్శి గిన్నె లక్ష్మణ్‌, జిల్లా అధ్యక్షుడు చెన్నమనేని శ్రీకుమార్‌, డీవైస్‌వో రామదాస్‌, ఆర్గనైజింగ్‌ సెక్రటరీ సానబాబులకు కృతజ్ఞతలు తెలిపారు.

ఎర్రబెల్లి స్వర్ణను సన్మానించిన సంగీతం

సిరిసిల్లటౌన్‌: రాష్ట్ర మహిళా కాంగ్రెస్‌ అధ్యక్షురాలిగా నియమితులైన ఎర్రబెల్లి స్వర్ణను డీసీసీ అధ్యక్షుడు సంగీతం శ్రీనివాస్‌ మర్యాదరపూర్వకంగా శనివారం కలిశారు. హైదరాబాద్‌లోని ఆమెను కలిసి శాలువా కప్పి అభినందనలు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement