● కలెక్టర్ గరీమా అగ్రవాల్
సిరిసిల్ల: నర్సరీల్లో పండ్ల మొక్కలను పెంచాలని మున్సిపల్ అధికారులను కలెక్టర్ గరీమా అగ్రవాల్ ఆదేశించారు. ‘ప్రజాపాలన – ప్రగతి ప్రణాళిక’లో భాగంగా సాయినగర్, జేపీనగర్‌లోని నర్సరీలను కలెక్టర్ శనివారం పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ గరీమా అగ్రవాల్ మాట్లాడుతూ సిరిసిల్ల మున్సిపల్ ఆధ్వర్యంలోని నర్సరీలో రోడ్ల వెంట, అలాగే ఇతర చోట్ల నాటే మొక్కలతో పాటుగా పండ్ల మొక్కలు సైతం పెంచాలని సూచించారు. మునగ, ఇతర రకాల మొక్కలను నర్సరీల్లో సిద్ధంగా ఉంచాలని ఆదేశించారు. సిరిసిల్ల ఆర్డీవో వెంకటేశ్వర్లు, మున్సిపల్ చైర్‌పర్సన్ జిందం కళాచక్రపాణి, మున్సిపల్ కమిషనర్ ఖదీర్‌పాషా, స్థానిక కౌన్సిలర్ ఆడెపు చంద్రకళ పాల్గొన్నారు.


