● బీఎస్పీ కేంద్రీయ రాష్ట్ర కో–ఆర్డినేటర్ చంద్రశేఖర్
సిరిసిల్లటౌన్: రాష్ట్రంలో బహుజనరాజ్యం సాధించినప్పుడే కాన్షీరామ్ నిజమైన నివాళి అర్పించినట్లుగా బీఎస్పీ కేంద్రీయ రాష్ట్ర కో–ఆర్డినేటర్ బోయిని చంద్రశేఖర్ పేర్కొన్నారు. జిల్లా కేంద్రంలోని అంబేడ్కర్‌చౌక్‌లో ఆదివారం నిర్వహించిన కాన్షీరామ్ 92వ జయంతి సభకు ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. పూలే, సాహుమహారాజ్, అంబేడ్కర్ ప్రారంభించిన సామజిక పరివార్తన ఉద్యమానికి కాన్షీరామ్ సర్వస్వం ధారబోశారన్నారు. కాంగ్రెస్, బీజేపీలు బహుజనుల బతుకులను నాశనం చేస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. నిషాని రామచంద్రం, ఎనగందుల వెంకన్న, మాతంగి అశోక్, నీరడి ఈశ్వర్, కల్లెపల్లి రాజేందర్, దొడ్డే సమ్మయ్య, పల్లె ప్రశాంత్‌గౌడ్, జిల్లా అధ్యక్షుడు కొమ్మట అశోక్, జిల్లా ప్రధాన కార్యదర్శి లింగంపల్లి మహేశ్, ఎడ్ల అరుణ్‌కుమార్, కొమ్మాట వేణు, కట్కూరి నాగరాజు పాల్గొన్నారు.
వేతనాలు విడుదల చేయించండి
సిరిసిల్ల ఎడ్యుకేషన్/సిరిసిల్లటౌన్: సమగ్ర ఆర్థిక నిర్వహణ సమాచార వ్యవస్థ(ఐఎఫ్‌ఎంఐఎస్) పోర్టల్‌లో ఆధార్ వివరాలు సరిపోలేదని నిలిపివేసిన ఉపాధ్యాయుల ఫిబ్రవరి వేతనాలు విడుదల చేయాలని టీఎస్‌యూటీఎఫ్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్‌కు వినతిపత్రం అందజేశారు. ఆధార్ వివరాలు సరిపోలేదని జిల్లాలో 30 మంది టీచర్ల వేతనాలు నిలిచిపోయాయన్నారు. వెంటనే చెల్లించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. జిల్లా అధ్యక్షుడు మహేందర్‌రావు, ప్రధాన కార్యదర్శి జంగిటి రాజు, నాయకులు అంబటి రమేశ్, గాలిపెల్లి సంతోష్, ఉపాధ్యాయులు రాంప్రసాద్, అనిల్‌కుమార్ పాల్గొన్నారు.


