ఎల్లారెడ్డిపేట మండలం పదిర బ్రిడ్జిపై భారీ గుంత పడి నెలలు గడుస్తున్నా మరమ్మతు చేయడంపై అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. ఆదివారం సాయంత్రం బస్సు, ఓ కారు త్రుటిలో ప్రమాదం నుంచి బయటపడ్డాయి. కామారెడ్డి నుంచి సిరిసిల్లకు వెళ్తున్న ఆర్టీసీ బస్సుకు ఎదురుగా వస్తున్న కారు వెంట్రుకవాసిలో ప్రమాదం నుంచి బయటపడ్డాయి. ఈ సంఘటనతో బస్సులోని ప్రయాణికులు, కారులో ప్రయాణిస్తున్న వారు ఊపిరిపీల్చుకున్నారు. నిత్యం వందలాది వాహనాలు నడిచే ఈ వంతెనను ఇప్పటికై నా మరమ్మతు చేయాలని కోరుతున్నారు. – ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల)


