● మహేశ్ బీ గీతే, ఎస్పీ
సిరిసిల్ల క్రైం: బాధితుల సమస్యలను చట్టపరంగా పరిష్కరించాలని జిల్లాలోని పోలీస్‌స్టేషన్ అధికారులకు ఎస్పీ మహేశ్ బీ గీతే సూచించారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన గ్రీవెన్స్ డేలో జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన 31 మంది తమ సమస్యలపై ఎస్పీకి వినతిపత్రాలు అందజేశారు. ఎస్పీ మాట్లాడుతూ ప్రజలకు పోలీస్ సేవలు మరింత చేరువ చేయడమే లక్ష్యంగా వ్యవహరించాలని పోలీసులకు సూచించారు. త్వరగా సమస్యలు పరిష్కరించాలన్నారు.
హోలీని సురక్షితంగా జరుపుకోవాలి
జిల్లా ప్రజలు హోలీని ఆనందంగా, సురక్షితంగా నిర్వహించుకోవాలని ఎస్పీ మహేశ్ బీ గీతే సూచించారు. హోలీ వేడుకల సందర్భంగా అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా భద్రత చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. సిరిసిల్లలో సోమవారం మాట్లాడారు. యువకులు అత్యుత్సాహానికి పోవద్దన్నారు. ర్యాష్ డ్రైవింగ్, స్టంట్లు చేయడం, ముగ్గురు, నలుగురు ఒకే వాహనంపై ప్రయాణించడం, బైక్‌లకు సైలెన్సర్ తొలగించి నడపడం వంటి చర్యలకు పోవద్దని హెచ్చరించారు. బలవంతంగా రంగులు వేయడం, అసభ్యంగా ప్రవర్తించడం, మహిళలను వేధించడం, గొడవలు సృష్టించడం, సోషల్ మీడియాలో అసత్య ప్రచారం చేయడం వంటి చర్యలపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. స్నానాల కోసం చెరువులు, కాల్వలు, అధిక నీటి ప్రవాహం ఉన్న ప్రాంతాలకు వెళ్లవద్దని సూచించారు.
వేములవాడ: ఈనెల 3న చంద్రగ్రహణం సందర్భంగా ఉదయం 6.15 నుంచి రాత్రి 7.15 గంటల వరకు వేములవాడ రాజన్న, భీమన్న ఆలయాలతోపాటు అనుబంధ ఆలయాలను మూసివేస్తున్నట్లు ఈవో రమాదేవి సోమవారం తెలిపారు. రాత్రి 7.15 గంటలకు పుణ్యహవనం, సంప్రోక్షణ తదితర పూజల అనంతరం భక్తులకు దర్శన అవకాశాలు కల్పించనున్నట్లు తెలిపారు.
ఇల్లంతకుంట(మానకొండూర్): కాళేశ్వరం ప్రా జెక్టు పరిధిలోని 11/6 కాల్వ పనులు పూర్తి చే యాలని కోరుతూ మండలంలోని పెద్దలింగా పూర్‌లో రైతులు చేపట్టిన రిలే నిరాహార దీక్ష సోమవారం నాటికి 21వ రోజుకు చేరింది. కా లువను పూర్తి చేయకుంటే చేతికొచ్చిన పంటలు ఎండిపోతాయని ఆవేదన వ్యక్తం చేశారు. దీక్షాశిబిరంలో బీజేపీ మండలాధ్యక్షుడు భూ మల్ల అనిల్‌కుమార్, బత్తిని సాయగౌడ్, దేశెట్టి శ్రీనివాస్, ముత్తవ్వ, అమ్ముల అశోక్, అనిల్, రైతులు కరికె నవీన్‌కుమార్, పయ్యావుల బాల య్య, సింగిరెడ్డి వెంకటరెడ్డి, కేతిరెడ్డి అమరేందర్‌రెడ్డి, కేశవేణి కొమరయ్య, రవి పాల్గొన్నారు.
సిరిసిల్ల అర్బన్: మున్సిపల్ కార్మికులకు కనీస వేతనం రూ.26వేలతోపాటు పెండింగ్ వేతన బకాయిలు వెంటనే చెల్లించాలని మున్సిపల్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర నాయకుడు గుర్రం అశోక్ కోరారు. కలెక్టరేట్ వద్ద సీఐటీయూ, మున్సిపల్ వర్కర్స్ ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో సోమవారం ధర్నా చేశారు. అనంతరం కలెక్టరేట్ ఏవో రాంరెడ్డికి వినతిపత్రం అందించారు. 15 రోజుల సెలవులు మంజూ రు చేయాలని, 60 ఏళ్లు నిండిన వారి స్థానంలో వారి కుటుంబ సభ్యులకు ఉద్యోగ అవకాశం కల్పించాలని కోరారు. నాయకులు గీత భిక్షపతి, కాసర్ల శంకర్, బాలయ్య, లచ్చయ్య, లక్ష్మి, మమత, దేవరాజు పాల్గొన్నారు.


