రహదారి యోగం | - | Sakshi
Sakshi News home page

రహదారి యోగం

Feb 25 2026 10:32 AM | Updated on Feb 25 2026 10:32 AM

రహదారి యోగం

రహదారి యోగం

సిరిసిల్ల సిగలో మరో మణిహారం రూ.20 కోట్లతో మానేరువాగు వెంట రోడ్డు విద్యానగర్‌ నుంచి సాయినగర్‌ వరకు పనులు ప్రారంభం

మానేరు

తీరం..

సిరిసిల్ల: సిరిసిల్ల పట్టణానికి మరో రహదారి వస్తుంది. మానేరువాగు వెంబడి పట్టణాన్ని ఆనుకుని నా లుగు వరసల రోడ్డు నిర్మాణమవుతోంది. మానేరు వంతెన(విద్యానగర్‌) నుంచి సాయినగర్‌ (సాయిబాబా ఆలయం) వరకు మూడు కిలోమీటర్ల రోడ్డు ను కొత్తగా నిర్మిస్తున్నారు. 2021–22 ఆర్థిక సంవత్సరంలో టెండర్లు పూర్తయిన ఈ పనులు మూడేళ్ల ఆలస్యంగా ఇప్పుడు మొదలయ్యాయి. రోడ్డు నిర్మా ణం పూర్తయితే పట్టణానికి కొత్త కాంతులు రానున్నాయి.

మానేరు వెంబడి అందమైన రోడ్డు..

సిరిసిల మానేరు వాగు వెంబడి మూడు కిలోమీటర్ల పొడువు కొత్త రోడ్డును నిర్మించేందుకు రూ.20కోట్లు మంజూరయ్యాయి. ఈ నిధులతో పనులు పొందిన కాంట్రాక్టర్‌ గతంలో వాగు వెంట చెట్లు, ముళ్ల పొదలను తొలగించారు. రోడ్డును ఫార్మేషన్‌ చేస్తున్న దశలో ఎన్నికలు రావడంతో పనులు ఆగిపోయాయి. అప్పటికే టెండర్లు పూప్తూయి కొంత మేరకు రోడ్డు పనులు ప్రారంభం కావడంతో ఆ పనులను పూర్తి చేసేందుకు నీటిపారుదల శాఖ అనుమతించింది. దీంతో విద్యానగర్‌ నుంచి సాయినగర్‌ వరకు పనులు ప్రారంభమయ్యాయి. వంద అడుగుల వెడల్పుతో నాలుగు వరసరల రహదారిని మధ్యలో డివైడర్‌తో నిర్మించనున్నారు. వాకింగ్‌ ట్రాక్‌తో కూడిన రోడ్డు, అందమైన పూల మొక్కలు, కనువిందు చేసే రహదారి నిర్మాణం చేయనున్నారు.

తగ్గనున్న ట్రాఫిక్‌ సమస్యలు

పట్టణంలోని విద్యానగర్‌ నుంచి సాయినగర్‌ వరకు కొత్త రోడ్డు నిర్మాణంతో ట్రాఫిక్‌ సమస్యలు తగ్గనున్నాయి. సిద్దిపేట, హైదరాబాద్‌ నుంచి వచ్చే వాహనాలు కామారెడ్డి, ఎల్లారెడ్డిపేట వైపు వెళ్లేందుకు పట్టణంలోకి రాకుండానే నేరుగా విద్యానగర్‌ వంతెన నుంచి బతుకమ్మ ఘాట్‌, సుభాష్‌నగర్‌, నెహ్రూనగర్‌ చెక్‌డ్యామ్‌ పక్కనుంచి సాయినగర్‌కు చేరుకుని కామారెడ్డి మార్గంలో వెళ్లే అవకాశం ఉంది. ఎవరైనా సరే అటు నుంచి ఇటు.. ఇటు నుంచి అటు వెళ్లేందుకు సిరిసిల్ల గాంధీచౌక్‌కు వెళ్లకుండానే నేరుగా ప్రయాణాలు సాగించేందుకు కొత్త రహదారి ఏర్పడుతుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement