క్రీడాకారులకు ఎస్పీ అభినందన
సిరిసిల్ల/సిరిసిల్లఅర్బన్: రాజస్థాన్‌లోని అజ్మీర్‌లో ఇటీవల జరిగిన జాతీయస్థాయి మాస్టర్ అథ్లెటిక్స్ పోటీల్లో జిల్లాకు చెందిన పలువురు పతకాలు సాధించారు. ఈసందర్భంగా క్రీడాకారులను మంగళవారం ఎస్పీ మహేశ్ బి గితే అభినందించారు. కాగా, జాతీయస్థాయిలో రాణించిన క్రీడాకారులు మార్చిలో ఈజిప్ట్ రాజధాని కై రోలో జరిగే అంతర్జాతీయ పోటీల్లో పాల్గొననున్నారు. అంతర్జాతీయ స్థాయిలోనూ రాణించాలని ఎస్పీ ఆకాంక్షించారు. పతకాలు సాధించిన క్రీడాకారులను మాస్టర్ అథ్లెటిక్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు సంగ స్వామి, కార్యదర్శి గొట్టెముక్కుల శేఖర్, ప్రతినిధులు గొట్టె అంజయ్య, బొజ్జ శేఖర్ అభినందించారు.


