జాతీయస్థాయి యోగాలో ‘సృజన’కు స్వర్ణం
సిరిసిల్లటౌన్: జాతీయస్థాయి యోగా పోటీల్లో సిరిసిల్లకు చెందిన వెల్దండి సృజన స్వర్ణ పతకం సాధించింది. తిరుపతి నగరంలో ఇటీవల జరిగిన ఆల్ ఇండియా సంస్కృత యూనివర్సిటీ ప్రయోగిక యోగా కాంపిటీషన్స్–2026లో జిల్లా నుంచి ఆమె పాల్గొంది. రూ.5వేల నగదు పురస్కారంతో పాటు బంగారు పతకం సాధించింది. దేశవ్యాప్తంగా 14 రాష్ట్రాల నుంచి 165 మంది పాల్గొనగా సృజన ఉన్నతంగా రాణించింది. ఈసందర్భంగా ఆమెను డీవైఎస్‌వో రాందాస్, యోగా శిక్షకులు ఉప్పల శ్రీనివాస్, బిళ్ల శ్రీకాంత్ తదితరులు అభినందించారు.


