నల్లరేగడి మట్టి వినియోగం
మానేరు తీరంలో రోడ్డు నిర్మాణానికి ఎర్రమట్టికి బదులుగా నల్లరేగడి మట్టిని పోస్తున్నారు. నల్లరేగడి మట్టిని పోస్తే.. రోడ్డు కుంగిపోయే ప్రమాదం ఉంటుంది. ఎర్రమట్టిని పోస్తూ, రోడ్‌రోలర్‌తో తొక్కిస్తూ సాంకేతిక లోపాలు లేకుండా.. ఎక్కువ కాలం మన్నికగా ఉండేలా కొత్త రోడ్డును వేయాల్సి ఉండగా.. కాంట్రాక్టర్ నల్లరేగడి మట్టిని పోస్తున్నారు. నల్లరేగడి మట్టి పోస్తే మానేరు వాగు ప్రవహించినప్పుడు రోడ్డు కోతకు గురయ్యే ప్రమాదం ఉంటుంది. రోడ్డు అడుగున(బయటకు కనిపించని విధంగా) నల్ల రేగడిని పోయడంతో రోడ్డు నాణ్యతపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఏది ఏమైనా నీటిపారుదల శాఖ అధికారులు క్షేత్రస్థాయిలో నాణ్యమైన మట్టితో పనులు జరిగేలా చూడాల్సిన బాధ్యత ఎంతైనా ఉంది. పట్టణ ప్రజలకు ఆహ్లాదాన్ని అందించేలా నిర్మించతలపెట్టిన రహదారిని పదికాలాల పాటు నిలిచేలా నాణ్యతతో నిర్మించాల్సిన అవసరం ఉంది.


